ప్రభుత్వ చీరల డబ్బులు ఇప్పించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ చీరల డబ్బులు ఇప్పించాలి

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

సిరిసిల్లటౌన్‌: ప్రభుత్వం కొనుగోలు చేసిన ఇందిరా మహిళాశక్తి చీరల బిల్లుల బకాయిలు ఇప్పించాలని కోరుతూ శుక్రవారం టెక్స్‌టైల్‌ ఏడీకి వినతిపత్రం ఇచ్చారు. సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు కోడం రమణ మాట్లాడుతూ యజ మానులు ఆసాములకు, కార్మికులకు ప్ర తీ వారం పూర్తిస్థాయిలో కూలీ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గతేడాది కొనుగో లు చేసిన చీరలకు 60 శాతం డబ్బులు కూడా ఇవ్వలేదన్నారు. ప్రస్తుత చీరలకు ఒక్క రూపా యి కూడా రాలేదన్నారు. బూర శ్రీనివాస్‌, సామల జగన్‌, రాపెల్లి శ్రీహరి, ఒడ్డేపల్లి కిష న్‌, బింగి సంపత్‌, సామనపల్లి ప్రభాకర్‌, సందుపట్ల పోచమల్లు, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

కోనోకార్పస్‌ చెట్ల తొలగింపు

వేములవాడ: పట్టణంలోని రెండో బైపాస్‌రోడ్డులో ప ర్యావరణా నికి హాని కలి గించే కోనోకార్పస్‌ చెట్లను మున్సిపల్‌ అధికారులు శుక్రవారం తొలగించారు. డివైడర్ల మధ్య ఏపుగా పెరిగిన చెట్లతో ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించడం లేదు. అంతేకాకుండా శ్వాసకోశ సమస్యలు వస్తుండడంతో స్థాని కుల ఆందోళనతో వీటిని తొలగిస్తున్నారు.

మానస పిల్లల ఆస్పత్రి తనిఖీ

సిరిసిల్ల: జిల్లా కేంద్రంలోని మానస పిల్లల ఆస్పత్రిలో శుక్రవారం జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఐదుగురు సభ్యుల కమిటీ విచారణ చేపట్టింది. రోగుల నుంచి అధికంగా చార్జీలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదుపై ఏర్పాటు చేసిన ఐదుగురు సభ్యుల కమిటీ ఆస్పత్రిని తనిఖీ చేసింది. చికిత్స విధానాలు, బిల్లులు, వసూలు చేసిన చార్జీలు, సంబంధిత రికార్డులను పరిశీలించారు. సమగ్ర నివేదికను జిల్లా అధికారులకు సమర్పించనున్నట్లు కమిటీ సభ్యులు తెలిపారు. తనిఖీలో వైద్యులు నాగేందర్‌బాబు, సౌమ్య, పూర్ణచందర్‌, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

ఎస్సీ ఎస్టీ కేసుపై డీఎస్పీ విచారణ

మానస పిల్లల ఆస్పత్రిలోని కొందరిపై వచ్చి న ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదుపై సిరిసిల్ల డీఎస్పీ నా గేంద్రచారి విచారణ చేపట్టారు. ఆస్పత్రిని సందర్శించి ఫిర్యాదుదారుల ఫిటిషన్‌ ఆధారంగా సాక్ష్యులను విచారించారు. ఎస్టీ, ఎస్టీ కేసుపై దర్యాప్తు కొనసాగుతుందని డీఎస్పీ తెలిపారు.

ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలి

తంగళ్లపల్లి(సిరిసిల్ల): ప్రతీ నీటి బొట్టును ఒడిసిపట్టాలని జిల్లా పంచాయతీ అధికారి (డీపీవో) జయశీల కోరారు. తంగళ్లపల్లి మండలం గండిలచ్చపేటలో శుక్రవారం నిర్వహించిన ప్రత్యేక గ్రామసభలో రైతులకు సలహాలు ఇచ్చారు. ఎల్‌నినో ప్రభావంతో నీటి ఎద్దడిని అధిగమించేందుకు ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని సూచించారు. అందరి భాగస్వామ్యంతో గండిలచ్చపేటను ‘మోడల్‌ విలేజ్‌’(ఆదర్శ గ్రామం)గా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. మాజీ సర్పంచ్‌ బామగారి పర్శయ్య, తహసీల్దార్‌ మురళీకృష్ణ, ఎంపీవో మీర్జా అఫ్జల్‌ అహ్మద్‌ బేగ్‌, మండల వ్యవసాయాధికారి సంజీవ్‌, ఇరిగేషన్‌ ఏఈ హిమబింధు, ఏపీవో రాజనర్సయ్య, సర్పంచ్‌ జంగిటి అంజయ్య, ఉపసర్పంచ్‌ భాను, పంచాయతీ కార్యదర్శి జి.వాణి పాల్గొన్నారు.

ఆరుతడి పంటలు వేయండి

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉన్నందునా రైతులు ఆరుతడి పంటలు సాగు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం కోరారు. మండలంలోని దుమాలలో శుక్రవారం నిర్వహించిన గ్రామసభలో రైతులకు అవగాహన కల్పించారు. అఫ్జల్‌ బేగం మాట్లాడుతూ లోటు వర్షపాతం ఉన్నందునా రాగులు, నువ్వులు వేసుకోవాలన్నారు. ఎంపీడీవో సత్తయ్య మాట్లాడుతూ జలసిరిలో భాగంగా ప్రతీ ఇంటికి ఇంకుడుగుంత, బోరుబావి వద్ద రీచార్జ్‌ స్ట్రక్చర్‌, ఫామ్‌పాండ్స్‌, ఊతకుంటలను నిర్మించుకోవాలని కోరారు. తహసీల్దార్‌ సుజాత, మండల వ్యవసాయాధికారి రాజశేఖర్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement