జిల్లా పరిధిలో విద్యుత్ పంపిణీ సేవలు అందించే ‘సెస్’ సంస్థ అధికారులు రోడ్డు నిర్మాణానికి అవసరమైన ప్రతిపాదిత రోడ్డులో ఉన్న విద్యుత్‌లైన్లు, హైటెన్షన్ లైన్ల షిఫ్టింగ్‌కు అయ్యే ఖర్చు అంచనాలను క్షేత్రస్థాయి సర్వేలు చేయాలని ఆదేశించారు. ఈ రోడ్డు నిర్మాణానికి డీపీఆర్ అందించే ధృవ కన్సల్టెన్సీ ఏజెన్సీతో సంయుక్త సర్వేలు చేయాలని ‘సెస్’ మేనేజింగ్ డైరెక్టర్‌ను నేషనల్ హైవే విభాగం ఈఈ ఆదేశించారు. ఈమేరకు క్షేత్రస్థాయి సర్వేలు రెండేళ్ల కిందటే నిర్వహించారు. ఈ రోడ్డు నిర్మాణంతో సిరిసిల్ల–సిద్దిపేట మధ్య ఉన్న వంకర రోడ్డుకు మోక్షం కలుగుతుంది.


