వేములవాడఅర్బన్: వేములవాడ ఏరియా ఆస్పత్రిలోని ఆరుగురు వైద్యులు బదిలీ అయ్యారు. ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ రవీందర్ స్టేషన్‌ఘన్‌పూర్‌కు బదిలీ కాగా ఇన్‌చార్జి సూపరిండెంట్‌గా డాక్టర్ సుభాషిణి శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఆస్పత్రిలో మొత్తం ఆరుగురు వైద్యులు సూపరింటెండెంట్ రవీందర్, అనిల్‌కుమార్ ఆర్థోపెడిక్, డాక్టర్ తిరుపతి అనస్థీషియా, డాక్టర్ రత్నమాల కంటి వైద్యనిపుణులు ఎల్లారెడ్డిపేటకు బదిలీ అయ్యారు. డాక్టర్ ప్రణతి ధర్మపురికి, డాక్టర్ పరమేశ్వరీ దుబ్బాకకు బదిలీ అయ్యారు. వేములవాడ ఏరియా ఆస్పత్రికి డాక్టర్ జ్యోతి, డాక్టర్ ఝాన్సి బదిలీపై వచ్చారు.


