శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026 | - | Sakshi
Sakshi News home page

శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026

Jul 25 2026 1:59 AM | Updated on Jul 25 2026 1:59 AM

శనివారం శ్రీ 25 శ్రీ జూలై శ్రీ 2026 ●

న్యూస్‌రీల్‌

స్పోర్ట్స్‌ మీట్‌

సిరిసిల్లటౌన్‌: కేంద్రంలోని బీజేపీ పాలనలో విద్యా విధానాలు లోపభూయిష్టంగా తయారయ్యాయని నిరసిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శుక్రవారం విద్యాసంస్థల బంద్‌ చేపట్టారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి మల్లారపు ప్రశాంత్‌ మాట్లాడుతూ నీట్‌ పరీక్ష నిర్వహిస్తున్న ఎన్టీఏను రద్దు చేసి పారదర్శకమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని కోరారు. డీవైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు గాంతుల మహేశ్‌, ఆర్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట అధ్యక్షుడు అంగూరి రంజిత్‌ మద్దతు తెలిపారు.

సిరిసిల్ల అర్బన్‌: నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసులకు క్రీడాపోటీలతో మానసికోల్లాసం కలుగుతుందని 17వ బెటాలియన్‌ కమాండెంట్‌ పీజేపీసీ ఛటర్జీ పేర్కొన్నారు. సర్ధాపూర్‌లోని 17వ బెటాలియన్‌లో శుక్రవారం ఇంటర్‌ కంపెనీ వార్షిక గేమ్స్‌ అండ్‌ స్పోర్ట్స్‌ మీట్‌ ప్రారంభించారు. అడిషనల్‌ కమాండెంట్‌ ఎం.ఐ.సురేష్‌, అసిస్టెంట్‌ కమాండెంట్లు ఎస్‌.సురేష్‌, ఎం.రాజు, ఆర్‌ఐలు రాంబ్రహ్మం, కుమారస్వామి, శ్రీనివాస్‌, శ్యాంప్రసాద్‌, వసంతరావు పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌: పెద్దూరు ప్రభుత్వ పాఠశాలలో శుక్రవారం బోనాలు తీశారు. విద్యార్థినులు అమ్మవారిగా.. విద్యార్థులు పోతురాజు వేషధారణలో ఆకట్టుకున్నారు. డప్పుచప్పుళ్ల మధ్య పోచమ్మ ఆలయానికి బోనాలతో వెళ్లి మొక్కులు చెల్లించుకున్నారు. హెచ్‌ఎం చక్రవర్తుల రమాదేవి, ఏఏపీసీ చైర్‌పర్సన్‌ తిప్పవరం సుధ, ఉపాధ్యాయులు గుండెల్లి రవీందర్‌, శ్రీనివాస్‌, మాధవి, ఉమ, రాజమల్లు, రవికుమార్‌, వాణిశ్రీ, వీణ, శంకర్‌, మహేశ్‌ పాల్గొన్నారు.

నిరసన.. బంద్‌

బోనం.. వైభోగం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement