కరీంనగర్: నగరంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూంలో ఈనెల 7 నుంచి 16 వరకు బ్రైడల్ జ్యువెలరీ షో నిర్వహించనున్నారు. ఈ జ్యువెలరీ షోను శుక్రవారం కరీంనగర్ జిల్లా ఐఎంఏ అధ్యక్షురాలు డాక్టర్ ఆకుల శైలజ ప్రారంభించారు. ఈ షోలో సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే విధంగా నవవధువుల కోసం కళాత్మకంగా రూపొందించిన ఆభరణాలు ప్రదర్శించబడతాయని నిర్వాహకులు తెలిపారు. నాణ్యతతో తయారు చేయబడి జీవిత కాలం మన్నికతో ఉండే ఆభరణాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. సేల్స్ మేనేజర్ సోహెల్ సిద్ధాంత్, మార్కెటింగ్ శ్రీనివాస్, విక్కీ తదితరులు పాల్గొన్నారు.
పారాగేమ్స్‌లో గిరిజన బిడ్డ ప్రతిభ
వీర్నపల్లి(సిరిసిల్ల): రాజన్నసిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం జవహర్‌లాల్‌తండాకు చెందిన దివ్యాంగురాలు భూక్య సక్కుబాయి పారా అథ్లెట్ జాతీయస్థాయిలో సత్తాచాటారు. ఇటీవల నిర్వహించిన సెకండ్ ఎడిషన్ చీఫ్ మినిస్టర్ కప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సక్కుబాయి ప్రతిభ కనబర్చి రెండు పతకాలు కై వసం చేసుకుంది. మార్చి 4, 5, 6 తేదీల్లో హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో జరిగిన క్రీడాపోటీల్లో సక్కుబాయి తన ప్రతిభను చాటారు. షార్ట్‌పుట్ విభాగంలో ఆమె రజతం సాధించగా, డిస్కస్ త్రోలో కాంస్యం గెలుసుకుంది.
గంజాయి పట్టివేత
వెల్గటూర్(ధర్మపురి): గంజాయి తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్సై ఉదయ్‌కుమార్ తెలినారు. వెల్గటూర్ మండలం జగదేవ్‌పేట శివారులో ఎస్సై, సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా కొండాపూర్‌కు చెందిన చెందిన బోరకుంట వెంకటేశ్, కనుకుంట్ల కళ్యాణ్ 60 గ్రాముల గంజాయి తరలిస్తూ పట్టుబడ్డారు. వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
గుర్తు తెలియని వ్యక్తి మృతి
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం కొడుముంజ శివారులోని కరీంనగర్–సిరిసిల్ల ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగిన ప్రమాదంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. సదరు వ్యక్తిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టినట్లు వేములవాడ టౌన్ సీఐ వీరప్రసాద్ తెలిపారు. స్థానికులు వేములవాడ ఏరియా ఆస్పత్రికి తరలించారన్నారు.


