● ఎవరూ ఆందోళన చెందొద్దు ● ఇండియన్ పీపుల్స్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): గల్ఫ్ దేశాలలో ప్రస్తుత యుద్ధం నేపథ్యంలో అక్కడ ఉన్న భారతీయుల క్షేమ సమాచారం కోసం భారత ప్రభుత్వం ఇండియన్ కౌన్సిలేట్‌ను దుబాయ్‌లో ఏర్పాటు చేసింది. భారతీయులు ఆందోళనకు గురికాకుండా సలహాలు, సహాయం, సమాచారం అందించడానికి ఈ హెల్ప్‌లైన్ దోహదం చేస్తున్నట్లు ఇండియన్ పీపుల్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కుంబాల మహేందర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. యుద్ధం ముగిసే వరకు దుబాయిలో హెల్ప్‌లైన్ కార్యాలయం కొనసాగిస్తామని పేర్కొన్నారు.
స్కూల్ వ్యాన్ ఢీకొని ఒకరికి తీవ్రగాయాలు
జగిత్యాలక్రైం: జగిత్యాల పట్టణంలోని గొల్లపల్లి రోడ్‌లో ద్విచక్రవాహనాన్ని పాఠశాల వ్యాన్ ఢీకొనగా ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. గొల్లపల్లి మండలం శంకర్‌రావుపేట గ్రామానికి చెందిన బండారి ప్రణీత్ శుక్రవారం జగిత్యాలలో ఓపెన్ డిగ్రీ పరీక్షలు రాసేందుకు హాజరయ్యాడు. తిరిగి స్వగ్రామానికి ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా గొల్లపల్లి రోడ్‌లో ఎడ్ల అంగడి చౌరస్తా వద్ద ప్రైవేటు స్కూల్ వ్యాన్ ఢీకొట్టింది. ప్రవీణ్ తలకు తీవ్రగాయాలై అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. స్థానికులు జగిత్యాలలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌కు తరలించారు. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని ప్రమాదానికి కారణమైన వ్యాన్‌ను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.


