ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు | - | Sakshi
Sakshi News home page

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తున్నారు దుబారా ఖర్చులతో నష్టం

కొందరు ఆధారాలు లేకుండా ‘సెస్‌’ సంస్థపై ఆరోపణలు చేస్తున్నారు. ఎన్‌పీడీసీఎల్‌, ఎస్‌పీడీసీఎల్‌ కంటే ‘సెస్‌’ పరిధిలో విద్యుత్‌ పంపిణీలో మెరుగైన సేవలు అందిస్తున్నాం. ఎన్పీడీసీఎల్‌ ఒక్కో యూనిట్‌కు రూ.4.77 చొప్పున బిల్లు జారీ చేస్తుంది. ఇందులో వ్యవసాయ వినియోగం సబ్సిడీని మినహాయించకుండా బిల్లు జారీ కావడంతో బకాయిలు పెరుగుతున్నాయి. మూడేళ్లుగా పాలకవర్గం తీసుకున్న నిర్ణయాలతో ఆదాయం పెరిగింది.

– చిక్కాల రామారావు, ‘సెస్‌’ చైర్మన్‌

‘సెస్‌’లో ఉద్యోగులకు జీతాలు ఎక్కువగా ఉన్నాయి. దుబారా ఖర్చులతో సంస్థకు నష్టం వాటిల్లుతోంది. విద్యుత్‌ పరికరాల కొనుగోలు నుంచి ఉద్యోగుల పదోన్నతుల వరకు అవినీతి ఉంది. ఏదైనా సమాచారం అడిగితే తప్పుడు వివరాలు అందిస్తున్నారు. ‘సెస్‌’ చైర్మన్‌ ప్రతీ నెల రూ.లక్ష జీతం, వాహన అద్దె రూ.60వేలు తీసుకుంటున్నారు. పాలకవర్గంపై అవినీతి ఆరోపణలున్నాయి. – బియ్యంకార్‌ శ్రీనివాస్‌, వినియోగదారుడు, సిరిసిల్ల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement