హోలీ వేడుకల్లో జడ్జీలు | - | Sakshi
Sakshi News home page

హోలీ వేడుకల్లో జడ్జీలు

Mar 5 2026 7:16 AM | Updated on Mar 5 2026 7:16 AM

హోలీ వేడుకల్లో జడ్జీలు ‘పది’ విద్యార్థులకు ‘సాక్షి’ స్టడీ మెటీరియల్‌ జిల్లా స్థాయి క్రీడాపోటీలకు ఆహ్వానం ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏదీ? ● వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు వేణు ● మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఎ.ఖదీర్‌పాషా

వేములవాడ: స్థానిక కోర్టు ఆవరణలో బుధవారం హోలీ వేడుకలు నిర్వహించారు. జూనియర్‌ సివిల్‌ జడ్జీలు ప్రవీణ్‌, జ్యోతిర్మయి న్యాయవాదులతో కలిసి హోలీ వేడుకల్లో పాల్గొన్నారు. ఏజీపీ ప్రశాంత్‌కుమార్‌, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు గుడిసె సదానందం, ప్రధాన కార్యదర్శి గడ్డం సత్యనారాయణరెడ్డి, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల్‌గౌడ్‌, పురుషోత్తం, పర్లపెల్లి అంజయ్య, గుండ రవి, కిశోర్‌రావు, నక్క దివాకర్‌, అనిల్‌కుమార్‌, జనార్దన్‌, జక్కుల పద్మ, బూర సరిత, మమత, అన్నపూర్ణ పాల్గొన్నారు.

వీర్నపల్లి(సిరిసిల్ల): వందశాతం ఉత్తీర్ణత లక్ష్యంగా ‘సాక్షి’ తనవంతు సాయంగా మరో ముందడుగు వేసింది. సామాజిక బాధ్యతలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థులకు పదో తరగతి స్టడీ మెటీరియల్‌ అందజేయడం అభినందనీయమని మండల విద్యాధికారి తుమ్మ శ్రీనివాస్‌ పేర్కొన్నారు. మండలంలోని 158 మంది పదో తరగతి విద్యార్థులకు సాక్షి స్టడీ మెటీరియల్‌ను బుధవారం పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయుడు అశోక్‌, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

సిరిసిల్ల అర్బన్‌ : మై భారత్‌(మినిస్ట్రీ ఆఫ్‌ యూత్‌ అండ్‌ స్పోర్ట్స్‌ ఎఫైర్స్‌) ఆధ్వర్యంలో నిర్వహించే జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొనేందుకు క్రీడాకారులను ఆహ్వానిస్తున్నట్లు ఆర్గనైజర్‌ దొంతరవేణి హరీశ్‌ కోరారు. అగ్రహారంలోని జేఎన్టీయూ మైదానంలో ఈనెల 6, 7 తేదీల్లో జిల్లా స్థాయి వాలీబాల్‌, కబడ్డీ, రన్నింగ్‌, షార్ట్‌పుట్‌, బ్యాడ్మింటన్‌, చెస్‌ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. క్రీడాకారులు 18 నుంచి 30 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. వివరాలకు 86882 95297, 93474 61020, 89785 83002లో సంప్రదించాలని కోరారు.

సిరిసిల్లటౌన్‌: ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం ఎక్కడ అమలవుతుందని సీపీఐ అనుబంధం వ్యవసాయ కార్మికసంఘం అధ్యక్షుడు గుంటి వేణు ప్రశ్నించారు. సిరిసిల్లలోని కార్మికభవన్‌లో బుధవారం మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా వ్యవసాయ కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అమలు చేయడం లేదన్నారు. రంగారెడ్డి మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో కొందరికి మాత్రమే మొదటి విడతగా రూ.6వేలు ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందిని విస్మరించారన్నారు. సోమ నాగరాజు, అంజిరెడ్డి, ప్రకాశ్‌ పాల్గొన్నారు.

పన్నులు విధిగా చెల్లించాలి

సిరిసిల్లటౌన్‌: పట్టణంలోని గృహ యజమానులు, వాణిజ్య గృహయజమానులు బల్దియాకు ఆస్తి, నీటి పన్నులు విధిగా చెల్లించాలని మున్సిపల్‌ కమిషనర్‌ ఎం.ఏ.ఖదీర్‌పాషా బుధవారం ప్రకటనలో కోరారు. ఆస్తి పన్ను, ట్రేడ్‌ లైసెన్స్‌, వివిధ ప్రకటనల ఫీజులు సకాలంలో చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని కోరారు. పట్టణాభివృద్ధి, పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధిదీపాల నిర్వహణ, డ్రైనేజ్‌ వ్యవస్థ బలోపేతం వంటి కార్యక్రమాలు పన్నుల ద్వారా లభించే ఆదాయంతోనే నిర్వహిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్‌ సిబ్బందికి ప్రజలు సహకరించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement