6న కల్యాణం.. 8న రథోత్సవం
వేములవాడలో ఐదు రోజుల ఆధ్యాత్మిక వైభవం
శివార్చన వేదికపై వేడుకలు
వేములవాడ: వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో గురువారం నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఐదు రోజులపాటు నిర్వహించే ఈ ఉత్సవాలకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 6న స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. ఇందుకు గుడిచెరువు ఖాళీ స్థలంలోని శివార్చన వేదికను సిద్ధం చేస్తున్నారు. గుడి చెరువు ఖాళీ ప్రాంగణంలో వేలాది మంది భక్తులు కూర్చొని కల్యాణాన్ని ప్రత్యక్షంగా తిలకించే అవకాశం లభించనుంది.
8న రథోత్సవం
ఈనెల 8న పట్టణంలోని ప్రధాన వీధిలో స్వామి వారి రథోత్సవం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవానికి భక్తులు భారీగా హాజరయ్యే అవకాశం ఉంది. ఆలయ అధికారులు తాగునీరు, భక్తులు కూర్చునేందుకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తున్నారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయ ప్రాంగణం పుష్పాలతో అలంకరించనున్నారు.


