ఇందిరమ్మకు ఆటంకాలు!
ఇళ్లు పోసినవి అయినవి
● పెరిగిన ధరలు.. అందని బిల్లులు ● పూర్తయినవి 142.. ప్రారంభం కానివి 1,816 ● పునాదుల్లోనే 4,599 గృహాల పనులు
ఇది గంభీరావుపేట మండలం ముస్తాఫానగర్‌లోని బండ బాలమణికి ఇచ్చిన ఇందిరమ్మ ఇల్లు మంజూరుపత్రం. స్థానిక పంచాయతీ కార్యదర్శి దగ్గరుండి మరీ ఇల్లుకు ముగ్గుపోయించారు. బాలమణి సొంతింటి కోసం తనపై ఉన్న బంగారాన్ని అమ్మేసి, మరికొంత అప్పు చేసి మరీ పనులు మొదలుపెట్టారు. కానీ ఇదే పేరుతో మరో ఆమె ఉండడంతో ఆమె ఖాతాలో ఇందిరమ్మ ఇల్లు బిల్లు జమయ్యింది. పొరపాటును గుర్తించిన అధికారులు ప్రభుత్వ సొమ్ము డ్రా కాకుండా బ్యాంకు ఖాతాను ఫ్రీజ్ చేశారు. కానీ ఇల్లు కట్టుకున్న బాలమణి దంపతులకు బిల్లు రాకపోవడంతో దిక్కులు చూస్తున్నారు.
కలెక్టర్ గరీమా అగ్రవాల్, మున్సిపల్, హౌసింగ్ అధికారులతో కలిసి సిరిసిల్ల పట్టణ శివారులోని పెద్దూరులో పర్యటించారు. నెల రోజుల్లో వంద ఇందిరమ్మ ఇళ్లను ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని సూచించారు. సిరిసిల్ల పట్టణంలో 808 ఇళ్లు మంజూరు చేయగా.. ఇప్పటి వరకు 554 నిర్మాణాల కోసం ముగ్గు పోశారు. 461 ఇళ్లు బేస్‌మెంట్ వరకు, 326 ఇళ్లు గోడల వరకు, 250 స్లాబ్ లెవల్‌లో ఉన్నాయి. జిల్లాలోని అన్ని మండలాల ఎంపీడీవోలు నిత్యం పది ఇందిరమ్మ ఇళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ పనులు పూర్తి చేసేలా చూడాలని కలెక్టర్ ఆదేశించారు.
ఇది వీర్నపల్లికి చెందిన జక్కుల సరిత నిర్మించుకుంటున్న ఇందిరమ్మ ఇల్లు. ఇప్పటికే ఇల్లు నిర్మాణానికి రూ.4 లక్షల వరకు ఖర్చు అయ్యాయి. కానీ ప్రభుత్వం నుంచి రూ.లక్ష మాత్రమే బిల్లు వచ్చింది. ఇల్లుకు స్లాబ్‌వేసిన తరువాత మరో రూ.లక్ష ఇస్తామని అధికారులు అంటున్నారు. సిమెంట్, ఇసుక, ఇటుక, మేసీ్త్ర, లేబర్ చార్జీలు పెరగడంతో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం ఇబ్బందిగా మారింది. ప్రభుత్వం బిల్లులు తొందరగా ఇస్తే లబ్ధిదారుల సొంత జాగాలో ఆశల ఇల్లు రూపుదిద్దుకుంటుంది.
సిరిసిల్ల: ఇల్లు నిర్మించుకోవడం అనేది ప్రతీ వ్యక్తి జీవితంలో ఓ సుందరస్వప్నం. సొంతిల్లు లేని పేదలకు అదో కల. అలాంటి పేదలకు సొంతింటి కల ను నిజం చేసేందుకు ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల ని ర్మాణాన్ని చేపట్టింది. కానీ ఇంటి నిర్మాణ వ్యయం భారీగా పెరిగింది. ఇసుక రూ.2వేలకు ట్రిప్పు వంటి సమస్యలు ప్రధానంగా ఆటంకంగా మారింది. మేసీ్త్ర చార్జీలు భారీగా పెరగడంతో ఇల్లు కట్టుకోవ డం కష్టంగా ఉంది. ప్రభుత్వం మంజూరు చేసే రూ.5 లక్షలు సరిపోవడం లేదు. లబ్ధిదారులు విధి గా మరో రూ.5 లక్షలు అప్పు చేయాల్సి వస్తుంది. నిబంధనల మేరకు ఇందిరమ్మ ఇంటిని కట్టుకున్నా తప్పనిసరిగా మరో రూ.5లక్షలు అప్పు చేయాల్సి వస్తోంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరైన లబ్ధిదారులు మహిళా సంఘాల్లో సభ్యులుగా ఉంటే రూ.లక్ష వరకు రుణం అందిస్తున్నారు. జిల్లాలోని 862 మందికి రూ.లక్ష నుంచి రూ.2లక్షల వరకు మహిళా సంఘాల ద్వారా రూ.10.28 లక్షలు బ్యాంకు ద్వారా రుణాలు అందించారు. మార్కెట్‌లో ఇంటి నిర్మాణ వస్తువుల ధరలు పెరగడంతో ఇందిరమ్మ ఇళ్ల పనులు ఆశించిన స్థాయిలో ముందుకు సాగడం లేదు.
మండలం మంజూరైన ముగ్గు బేస్‌మెంట్ గోడలు స్లాబ్ పూర్తి
గంభీరావుపేట 558 382 320 220 156 06
ముస్తాబాద్ 530 419 344 226 177 10
సిరిసిల్ల మున్సిపల్ 808 553 466 339 272 08
తంగళ్లపల్లి 558 456 389 299 250 15
వీర్నపల్లి 226 170 134 72 50 02
ఎల్లారెడ్డిపేట 539 433 368 274 212 05
చందుర్తి 522 419 318 213 152 11
కోనరావుపేట 542 458 393 305 251 16
రుద్రంగి 358 235 175 106 64 01
వేములవాడ అర్బన్ 378 233 175 136 104 09
వేములవాడ రూరల్ 342 287 236 177 145 06
వేములవాడ మున్సిపల్ 484 373 310 242 199 15
బోయినపల్లి 775 591 481 361 295 28
ఇల్లంతకుంట 788 583 490 355 264 10
మొత్తం 7,408 5,592 4,599 3,325 2,591 142
ఇందిరమ్మకు ఆటంకాలు!
ఇందిరమ్మకు ఆటంకాలు!
ఇందిరమ్మకు ఆటంకాలు!


