విన్నపాలు వినవలే..
● ప్రజావాణికి 109 దరఖాస్తులు ● అర్జీలు సకాలంలో పరిష్కరించాలి ● కలెక్టర్ గరీమా అగ్రవాల్
సిరిసిల్ల అర్బన్: క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో పలువురు కలెక్టరేట్ బాట పడుతున్నారు. కలెక్టరేట్‌లో నిర్వహించే ప్రజావాణిలో తమ సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తమ సమస్యలతో కలెక్టరేట్‌కు తరలివచ్చారు. తమ సమస్యలు పరిష్కరించాలని విన్నవించారు. వివిధ సమస్యలపై 109 మంది కలెక్టర్‌కు విన్నవించారు. బాధితుల నుంచి అర్జీలు స్వీకరించిన కలెక్టర్ గరీమా అగ్రవాల్ మాట్లాడుతూ ప్రజావాణికి వచ్చిన దరఖాస్తులు పెండింగ్‌లో పెట్టవద్దని సూచించారు. ఎప్పటికప్పుడు పరిష్కరించాలన్నారు.


