ఆయిల్‌పామ్ సందర్శనకు రైతులు
సిరిసిల్ల: ఆయిల్‌పామ్ సాగు, ఫ్యాక్టరీ సందర్శనకు జిల్లాలోని రైతులు సోమవారం కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు తరలివెళ్లారు. ఈ బస్సుయాత్రను కలెక్టర్ గరీమా అగ్రవాల్ సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఉద్యానవన, వ్యవసాయశాఖ అధికారులకు ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణం లక్ష్యాలను నిర్ణయించారు. ఇందులో భాగంగానే రైతులను క్షేత్రస్థాయి పరిశీలనకు తీసుకెళ్లారు. జిల్లా వ్యవసాయాధికారి అఫ్జల్‌బేగం, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి శరత్‌బాబు, ఉద్యానవన శాఖ అధికారులు గోవర్ధన్, లోకేశ్ పాల్గొన్నారు. అంతకుముందు జిల్లాలో గుర్తించిన చెరువులు, రిజర్వాయర్ల(వెట్‌ల్యాండ్స్) సంరక్షణ, అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. జిల్లా అటవీశాఖ అధికారి బాలమణి, అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్, డీఆర్డీవో గీత, జిల్లా నీటిపారుదల శాఖ అధికారి కిశోర్‌కుమార్, ఈఈలు సంతుప్రకాశ్, ప్రశాంత్, ఎఫ్‌ఆర్వో కల్పన పాల్గొన్నారు.


