చికెన్ ట్రిపుల్ సెంచరీ!
● చలికి చనిపోతున్న కోళ్లు ● డిమాండ్‌కు తగ్గ సరఫరా కరువు ● వరుస పండుగలతో రికార్డు ధర
తంగళ్లపల్లిలో బస్టాండ్, మరుగుదొడ్లు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. పది వేలకు పైగా జనాభా ఉన్న తంగళ్లపల్లిలో బస్టాండ్, మరుగుదొడ్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి ప్రత్యేక నిధులు విడుదల చేయాలి. – గజభీంకార్ సృజన, సంతోష్, తంగళ్లపల్లి
బోయినపల్లి(చొప్పదండి): వరుస పండుగలతో చికెన్ ధరలకు రెక్కలొచ్చాయి. స్కిన్‌లెస్ కేజీ చికెన్ ట్రిపుల్ సెంచరీ దాటింది. స్కిన్‌తో రూ.270, లైవ్ కోడి కిలో రూ.190 విక్రయిస్తున్నారు. గత రెండేళ్లుగా చికెన్ ధరలు నిలకడగానే ఉంటున్నాయి. మొదట గ్రామపంచాయతీ ఎన్నికలు, అనంతరం న్యూ ఇయర్, సంక్రాంతి, ఇప్పుడు సమ్మక్క జాతర మొదలుకావడంతో చికెన్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. కాగా గత నెల క్రితం రూ.8 పలికిన సింగిల్ కోడిగుడ్డు.. ఇప్పుడు రూ.7లకు చేరింది. ఆరు నెలలుగా కేజీ చికెన్ సుమారు రూ.220 నుంచి రూ.240 మాత్రమే ఉండేది. డిసెంబర్‌లో జీపీ ఎన్నికల్లో రూ.280కు చేరింది. గత పదిహేను రోజులుగా కిలోకు రూ.300 పలుకుతోంది.
రెండేళ్లుగా నిలకడగా చికెన్ ధరలు
గత రెండేళ్లుగా చికెన్ ధరలు రూ.290 దాటలేదు. ప్రస్తుతం చలికాలం సీజన్‌లో డిమాండ్‌కు సరిపడా కోళ్లు లేక ధరలు పెరిగాయి. కోడిపిల్లలను ఫామ్‌లో వేసిన తర్వాత 40 రోజుల వరకు పెంచాలి. సాధారణ సీజన్లలో 40 రోజుల సమయానికి కోడి రెండు కిలోల వరకు బరువు పెరుగుతుంది. చలికాలంలో ఎక్కువగా కోడిపిల్లలు చనిపోతుంటాయి. రెండు కిలోల వరకు కోడి ఎదగాలంటే ఒక బర్డ్ వెంట దాదాపు రూ.200 వరకు ఖర్చు చేయాల్సి ఉంటుందని కోళ్ల ఫారం యజమానులు పేర్కొంటున్నారు.
భారీగా విక్రయాలు
సాధారణంగా ఆదివారం చికెన్ విక్రయాలు భారీగా ఉంటాయి. ఆదివారం ఒక్కో ప్రాంతంలో సుమారు 350 నుంచి 400 క్వింటాళ్లకు పైగా చికెన్ విక్రయాలు సాగుతాయి. మండల కేంద్రాల్లో సుమారు 20 నుంచి 40 క్వింటాళ్ల మేర విక్రయాలు జరుగుతాయి. అయితే ధరలు పెరగడంతో చికెన్ విక్రయాలు సైతం తగ్గినట్లు చికెన్ సెంటర్ల నిర్వాహకులు తెలుపుతున్నారు. గతంలో కిలో వరకు కొనుగోలు చేసే వారు ఇప్పుడు అరకిలో వరకే తీసుకెళ్తున్నట్లు తెలిపారు.
చికెన్ ట్రిపుల్ సెంచరీ!


