ఆకాశమే హద్దుగా ఎదగాలి
మహిళల సంక్షేమానికి పెద్దపీట
ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్
సిరిసిల్లటౌన్/వేములవాడఅర్బన్: అతివలు ఆకాశమే హద్దుగా ఎదుగాలని, మహిళ సంక్షేమానికి కాంగ్రెస్ సర్కారు పెద్దపీట వేస్తుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. సిరిసిల్లలోని 903 మహిళా సంఘాలకు రూ.3,18,49,135 విలువైన వడ్డీలేని రుణాలను కలెక్టర్ గరీమా అగ్రవాల్‌తో కలిసి సోమవారం అందజేసి మాట్లాడారు. ఇప్పటి వరకు మూడు విడతల్లో ఎస్‌హెచ్‌జీలకు వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశామని తెలిపారు. మూడో విడత కింద 1295 ఎస్‌హెచ్‌జీలకు రూ.4కోట్ల 64 లక్షల 68 వేల 771 రూపాయలు లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమయ్యాయని వివరించారు. వేములవాడను టెంపుల్‌సిటీగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటికే రూ.150 కోట్లు మంజూరు చేశామని, పనులు జరుగుతున్నాయన్నారు. పట్టణంలోని 28 వార్డుల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు పూర్తయ్యాయని, అదనంగా మరిన్ని ప్రాంతాల్లో పనుల కోసం రూ.4.20కోట్లు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. టూరిజం శాఖ ద్వారా వేములవాడ గుడి చెరువులో బోటింగ్ సౌకర్యానికి రూ.1.40 కోట్లు మంజూరు చేయించినట్లు వెల్లడించారు.
మహిళలతో దేశ ప్రగతి
మహిళల ఆర్థిక ప్రగతితో దేశ, రాష్ట్ర ప్రగతి సాధ్యమని కలెక్టర్ గరీమా అగ్రవాల్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు కల్పన, మరమ్మతు పనులు అమ్మ ఆదర్శ పాఠశాల కింద మహిళా సంఘాలకు అందించామన్నారు. స్కూల్ పిల్లల యూనిఫాంలు కుట్టించి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లు మహిళల పేరిట ఇస్తుందని, కొనుగోలు కేంద్రాలు, ఇతర వ్యాపారాలకు అవకాశం కల్పించిందని తెలిపారు. సిరిసిల్లలో త్వరలో యూడీఐడీ బ్లాక్ అందుబాటులోకి రానుందని, ఎంఏయూడీ నిధులతో సిరిసిల్లను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. జిల్లా గ్రంథాలయ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్లు రాజు, స్వరూపారెడ్డి, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాభాయి, మెప్మా ఏవో మీర్జా ఫసహత్ అలీ బేగ్, శేషాద్రి, తహసీల్దార్ విజయ ప్రకాశ్‌రావు పాల్గొన్నారు.
ప్రజా ఆశీర్వాదం కాంగ్రెస్‌పైనే..
సిరిసిల్లటౌన్: రెండేళ్లుగా అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సాగుతున్న కాంగ్రెస్ పార్టీపైనే ప్రజల ఆశీర్వాదం ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. డీసీసీ ఆఫీస్‌లో సోమవారం మున్సి పల్ ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడమే లక్ష్యంగా ముందుకు పోతున్నామన్నారు. నేతన్నలకు కేటీఆర్ రూ.300 కోట్లు బకాయిలు పెట్టారన్నారు. నేతన్నల ముప్పై ఏళ్ల కల యారన్ డిపోను కాంగ్రెస్ ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. వర్షాకాలం వస్తే సిరిసిల్ల వరదల్లో మునిగిపోవడమే కేటీఆర్ చేసిన అభివృద్ధా అని అడిగారు. సిరిసిల్ల, వేములవాడ ప్రజలు కాంగ్రెస్‌కు అవకాశం ఇవ్వాలని కోరారు. జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారా యణ, డీసీసీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపతిరుపతిరెడ్డి, పార్టీ పట్టణ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాశ్ పాల్గొన్నారు.


