కొత్త సర్పంచులకు శిక్షణ
వేములవాడరూరల్: వేములవాడ నియోజకవర్గంలో కొత్తగా ఎన్నికై న సర్పంచులకు సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. వేములవాడ మండలంలో సోమవారం ఈ కార్యక్రమాన్ని జిల్లా అధికారులు ప్రారంభించారు. ఈ శిక్షణకు వేములవాడఅర్బన్, వేములవాడరూరల్, రుద్రంగి, కోనరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలకు చెందిన సర్పంచులు హాజరయ్యారు. ఐదు రోజులపాటు అవగాహన కల్పించనున్నారు. డీపీవో షరీఫొద్దీన్, సీఈవో వినోద్, ట్రైనర్లు, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
సిరిసిల్లకల్చరల్: ఎస్సీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో నిర్వహించే ఐదు నెలల ఫౌండేషన్ కోర్సును యువత సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరీమా అగ్రవాల్ కోరారు. సంబంధిత కరపత్రాన్ని సోమవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. జీద్యోగ పోటీపరీక్షలకు ఉపకరించేలా రూపొందించిన కోర్సును త్వరలో ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువత ఈనెల 30లోపు http://tsstudycircle.co.inలో దరఖా స్తు చేసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 8న ప్రవేశపరీక్షలో ప్రతిభచాటిన మొదటి వంద మందికి ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఎంపికైన వారికి ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. వివరాలకు స్టడీసర్కిల్ 83413 87700లో సంప్రదించాలని సూచించారు.
సిరిసిల్లటౌన్: పాలిస్టర్ వార్పిన్ కార్మికుల కూలి పెంచాలని వార్పిన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిరిమల్ల సత్యం, కార్యదర్శి మూశం రమేశ్ డిమాండ్ చేశారు. సోమవారం సీఐటీయూ వార్పిన్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఒక్క రోజు సమ్మె చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈనెల 26 వరకు కూలి పెంచకుంటే నిరవధిక సమ్మెకు ది గుతామని సమ్మె నోటీస్ అందించారు. కోడం రమణ, ఎగమంటి ఎల్లారెడ్డి, ఉడుత రవి, వేణు, ప్రవీణ్, దాసు, దోమల రమేశ్, ఆడిచర్ల రాజు, సదానందం, రమేశ్ పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని జిల్లెల్ల ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం(ఏజీహబ్), ఎస్‌బీఐ, ఏఆర్‌ఐఎస్‌ఏ ల్యాబ్ సంయుక్తంగా బీజేఆర్ వ్యవసాయ కళాశాలలో మూడు రోజుల ‘డిజిటల్ అగ్రిప్రెన్యూర్షిప్’ సామర్థ్యాభివృద్ధి వర్క్‌షాప్ సోమవారం ప్రారంభమైంది. డిజైన్ థింకింగ్ కోర్సులో ప్రతిభ చాటిన 45 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. ముఖ్య అతిథిగా ఎస్‌బీఐ జనరల్ మేనేజర్ రంజన్‌కుమార్‌నాయక్, కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ రజియా సుల్తానా, ల్యాబ్ ప్రాజెక్ట్ హెడ్ డాక్టర్ సత్యనారాయణ పాల్గొన్నారు.
ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోం
సిరిసిల్లటౌన్: సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టమొచ్చి నట్లు మాట్లాడుతూ ప్రజల మనోభావాలు దెబ్బతీస్తే ఊరుకోబోమని బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య హెచ్చరించారు. సిరి సిల్లలోని బీఆర్‌ఎస్ భవనంలో సోమవారం వి లేకరులతో మాట్లాడారు. తెలంగాణ సాధకు డు కేసీఆర్, బీఆర్‌ఎస్ పార్టీని ఇష్టం వచ్చినట్లు మాట్లాడిన సీఎంను రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారన్నారు. గ్రామాల్లో ప్రజలే పార్టీ జెండా గద్దెలు నిర్మించుకున్నారని, వాటిని కూల్చేయమనడం వారి మనోభావాలు దెబ్బతీ సేవే అన్నారు. బీఆర్‌ఎస్ జోలికొస్తే గ్రామాల్లో రేవంత్‌రెడ్డి సమాధులు కడతామని హెచ్చరించారు. ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపా రు. చిక్కాల రామారావు, జిందం చక్రపాణి, గూడూరి ప్రవీణ్, బొల్లి రామ్మోహన్, దార్నం లక్ష్మినారాయణ, కృష్ణారెడ్డి పాల్గొన్నారు.
కొత్త సర్పంచులకు శిక్షణ
కొత్త సర్పంచులకు శిక్షణ
కొత్త సర్పంచులకు శిక్షణ


