ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయం
● ఎస్పీ మహేశ్ బీ గీతే
సిరిసిల్లక్రైం: రోడ్డు ప్రమాదాల నివారించి ప్రజల ప్రాణాలను రక్షించడమే ధ్యేయంగా పోలీస్ శాఖ పనిచేస్తుందని ఎస్పీ మహేశ్ బీ గీతే పేర్కొన్నారు. జిల్లాలో జనవరి 1 నుంచి 31 వరకు నిర్వహించే జాతీయ రోడ్డు భద్రత అవగాహన మాసోత్సవాల పోస్టర్‌లను జిల్లా పోలీస్ కార్యాలయంలో గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. హెల్మెట్, సీట్‌బెల్ట్ వినియోగం, మద్యం సేవించి వాహనం నడపకూడదనే అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేశారు. వేములవాడ ఏఎస్పీ రుత్విక్ సాయి, అదనపు ఎస్పీ చంద్రయ్య, డీటీవో లక్ష్మణ్, ఎంబీఏ వంశీధర్, ఏఎంవీఐ రజనీదేవి, పృథ్వీరాజ్‌వర్మ పాల్గొన్నారు.
వేములవాడ: రిటైర్డ్ ఉద్యోగులకు 2024 మార్చి నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పించాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు గురువారం వినతిపత్రం అందించారు. వెంకటయ్య, ధర్మయ్య, తిరుపతి, శ్రీనివాస్, చక్రపాణి, రవీందర్ తదితరులు ఉన్నారు.
సిరిసిల్ల: చేనేత జౌళిశాఖ ఇన్‌చార్జి సహాయ సంచాలకులుగా బి.సంతోష్‌కుమార్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. సిరిసిల్ల ఏడీగా పనిచేసిన రాఘవరావును కరీంనగర్ ఏడీగా బదిలీ చేశారు. కరీంనగర్ ఏడీగా పనిచేసిన విద్యాసాగర్ బుధవారం ఉద్యోగ విరమణ చేయగా.. ఆయన స్థానంలో రాఘవరావును నియమించారు. సిరిసిల్ల చేనేత, జౌళిశాఖ ఆఫీస్‌లో అభివృద్ధి అధికారి(డీవో)గా పనిచేస్తున్న బి.సంతోష్‌కుమార్‌కు ఏడీగా పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈమేరకు చేనేత, జౌళిశాఖ కమిషనర్ శైలజారామయ్యర్ ఆదేశాలు చేశారు. నూతనంగా ఏడీగా బాధ్యతలు స్వీకరించిన సంతోష్‌కుమార్‌ను పలువురు వస్త్రోత్పత్తిదారులు పుష్పగుచ్ఛంతో అభినందించారు. బదిలీ అయిన ఏడీ రాఘవరావుకు వీడ్కోలు పలికారు.
ఇల్లంతకుంట(మానకొండూర్): మండలంలోని పలు గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకొని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను కలిశారు. బెజ్జంకిలో కలిసి శాలువాతో సన్మానించారు. పార్టీ మండలాధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, యువజన విభాగం మాజీ అధ్యక్షుడు అంతగిరి వినయ్‌కుమార్, ఇల్లంతకుంట సర్పంచ్ మామిడి రాజు, చిట్టి ప్రదీప్‌రెడ్డి, ఎండీ జమాల్, రేగుల కార్తీక్, కాసుపాక శంకర్ ఉన్నారు.
సిరిసిల్ల: సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల్లో పోలింగ్‌స్టేషన్‌ల వారీగా ఓటర్ల జాబితాను గురువారం వెల్లడించారు. ఓటర్ల జాబితాను మున్సిపల్ నోటీసుబోర్డుపై అతికించారు. సిరిసిల్లలో 81,959 మందిలో పురుషులు 39,942, మహిళలు 42,011, థర్డ్ జెండర్ ఓటర్లు ఆరుగురు ఉన్నారు. జాబితాలో పేరు, చిరునామాలో తప్పులు ఉంటే తగిన ఆధారాలతో మున్సిపల్ ఆఫీస్‌లో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ తెలిపారు.
ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయం
ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయం
ప్రజల ప్రాణాల రక్షణే ధ్యేయం


