శుభాకాంక్షల వెల్లువ
న్యూస్‌రీల్
శుక్రవారం శ్రీ 2 శ్రీ జనవరి శ్రీ 2026
సిరిసిల్ల/వేములవాడఅర్బన్: జిల్లాలో నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా అధికారులు, ప్రజలు కేక్‌లు కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్‌కు, జిల్లా కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు శుభాకాంక్షలు వెల్లువలా వచ్చాయి. టీజీఈజేఏసీ చైర్మన్ ఎలుసాని ప్రవీణ్‌కుమార్, కన్వీనర్ సమరసేన్ తదితరులు కలెక్టర్ గరీమా అగ్రవాల్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. టీజీఈజేఏసీ కార్యదర్శి గాజుల సుదర్శన్, సహా అధ్యక్షుడు మెట్ట శ్రీకాంత్, కోశాధికారి మహమ్మద్ రియాజ్ పాషా, ట్రస్సా జిల్లా అధ్యక్షుడు జయంత్ కుమార్, ఏఎస్‌వోల జిల్లా అధ్యక్షుడు సుమన్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు జీవన్ పాల్గొన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధి తిప్పాపూర్‌లోని ఆటో యూనియన్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆటో యూనియన్ నాయకులు విప్‌ను సన్మానించారు.
తిప్పాపూర్‌లో కేక్ కట్ చేస్తున్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
కలెక్టర్ గరీమా అగ్రవాల్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న అధికారులు
శుభాకాంక్షల వెల్లువ
శుభాకాంక్షల వెల్లువ


