బఫర్‌జోన్‌ను గుర్తించాం
వేములవాడ మూలవాగు పక్కన బఫర్‌జోన్‌ను గుర్తించాం. గతంలోనే కొన్ని నిర్మాణాలకు మార్కింగ్ చేశాం. ఆయా నిర్మాణాల యజమానులకు మున్సిపల్ శాఖ అధికారులు నోటీసులు జారీచేశారు. కూల్చివేసే బాధ్యత మున్సిపల్ శాఖ అధికారులే చూసుకోవాలి.
– ప్రశాంత్, డీఈ, ఇరిగేషన్, వేములవాడ
నో ఆబ్జెక్షన్ వస్తేనే అనుమతులు ఇస్తున్నాం
వేములవాడ మూలవాగు బఫర్‌జోన్‌లో ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదు. ఒకవేళ ఏమైనా అనుమతులు ఇస్తే ఇరిగేషన్ శాఖ నుంచి ఎలాంటి అభ్యంతరం లేదని నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ వస్తేనే అనుమతులు ఇస్తున్నాం. తప్ప మేము ఎవరికీ అనుమతులు ఇవ్వడం లేదు.
– అన్వేశ్, మున్సిపల్ కమిషనర్, వేములవాడ


