కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్‌కు అదనపు బాధ్యతలు
● టీజీపీఎస్‌సీ కార్యదర్శిగా కలెక్టర్ హరిత బదిలీ
సిరిసిల్ల: జిల్లా కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు. జిల్లా కలెక్టర్‌గా ఉన్న ఎం.హరితను టీజీపీఎస్‌సీ కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు గురువారం రాత్రి ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. జిల్లా కలెక్టర్‌గా విధుల్లో చేరిన హరిత కొద్ది రోజులకే దీర్ఘకాలిక సెలవులో వెళ్లారు. అదనపు కలెక్టర్(స్థానిక సంస్థల)గా బాధ్యతలు స్వీకరించిన గరీమా అగ్రవాల్‌కు జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌గా బాధ్యతలు అప్పగించారు. ఆమె విధుల్లో చేరిన నాటి నుంచే ఇన్‌చార్జి కలెక్టర్‌గా పనిచేస్తున్నారు. తాజాగా జిల్లా కలెక్టర్‌గా ఉన్న హరితను టీజీపీఎస్‌సీ కార్యదర్శిగా నియమించారు. ఇన్‌చార్జి కలెక్టర్‌గా ఉన్న గరీమా అగ్రవాల్‌కు కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు అప్పగించారు.
నామాపూర్ వరకు బస్సులు నడపాలి
ముస్తాబాద్(సిరిసిల్ల): నామాపూర్ బస్టాండ్ వరకు ఆర్టీసీ బస్సులు నడిపి నాలుగు గ్రామాల ప్రజల ఇబ్బందులు తీర్చేందుకు కృషి చేస్తామని సిరిసిల్ల కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. ముస్తాబాద్ మండలం నామాపూర్ వరకు సిరిసిల్ల డిపో ఆర్టీసీ బస్సు సర్వీసులను నడపాలని సర్పంచ్ మాదాసు అనిల్ శుక్రవారం విన్నవించగా.. కేకే మహేందర్‌రెడ్డి ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. డిపో అధికారులు నామాపూర్‌కు చేరుకుని పరిశీలించారు. గతంలో మాదిరిగానే ముస్తాబాద్, సిరిసిల్లకు నడిచే సర్వీసులను నామాపూర్ వరకు కొనసాగిస్తామని డిపో అధికారులు వెల్లడించారు.
పల్లెల అభివృద్ధికి నిధులివ్వాలి
సిరిసిల్లటౌన్: పల్లెల అభివృద్ధికి పాలక ప్రభుత్వాలు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ డిమాండ్ చేశారు. ఈమేరకు డిసెంబర్ 29 నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాలలో ప్రత్యేక నిధుల కేటాయింపుపై చర్చ జరగాలని కోరా రు. సర్పంచులు, ఉపసర్పంచులుగా గెలు పొందిన సీపీఎం మద్దతుదారులను శుక్రవా రం సిరిసిల్ల చేనేత వస్త్ర వ్యాపార సంఘ భవనంలో సన్మానించారు. సర్పంచులు గ్రామాలను ఆదర్శ పంచాయతీలుగా తీర్చిదిద్దాలని సూచించారు. పెద్ద పంచాయతీలకు రూ.10 లక్షలు, చిన్న పంచాయతీలకు రూ.5లక్షలు ఇస్తామన్న సీఎం మాట నిలబెట్టుకోవాలన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు టి.స్కై లాబ్‌బాబు, రాష్ట్ర నాయకులు కేవీ ఎస్‌ఎన్. రాజు, ఎగమంటి ఎల్లారెడ్డి, జవ్వాజి విమల, మల్లారపు అరుణ్‌కుమార్, కోడం రమణ, గన్నేరం నర్సయ్య, గురజాల శ్రీధర్, మల్లారపు ప్రశాంత్, అన్నల్‌దాస్ గణేశ్, సూరం పద్మ, శ్రీరాముల రమేశ్‌చంద్ర పాల్గొన్నారు.
గొల్లపల్లిలో చిరుత సంచారం
కోనరావుపేట(వేములవాడ): మండలంలోని గొల్లపల్లి(వట్టిమల్ల) శివారు ప్రాంతంలో చిరుత సంచారంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. గ్రామ శివారులో చిరుతను చూసి భయాందోళనకు గురైన గొర్లకాపరులు పరుగెత్తుకుంటూ వచ్చి గ్రామస్తులకు తెలిపారు. అటవీ అధికారులు శుక్రవారం గొల్లపల్లి(వట్టిమల్ల) శివారులో పరిశీలించగా చిరుత అడుగు జాడలను గుర్తించామని సెక్షన్ ఆఫీసర్ అన్వర్‌పాషా తెలిపారు. ఫారెస్ట్ ఆఫీసర్ మాట్లాడుతూ గ్రామస్తులు ఒంటరిగా అటవీ ప్రాంతానికి వెళ్లవద్దన్నారు. వన్యప్రాణులతో జీవాలకు, పంటకు నష్టం జరిగితే తమకు సమాచారం ఇస్తే క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిహారం అందేలా చూస్తామన్నారు. సర్పంచ్ మాడుగుల ఆమని, ఉపసర్పంచ్ బండ గణేశ్, వార్డుమెంబర్ వంకాయల పోచయ్య, బొంగు శ్రీలత, రవి ఉన్నారు.
కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్‌కు అదనపు బాధ్యతలు
కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్‌కు అదనపు బాధ్యతలు


