ఉత్తర ద్వార దర్శనం.. పరమ పవిత్రం
వేములవాడ: ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని భక్తులకు ఉత్తరద్వార దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 30 ముక్కోటి ఏకాదశి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు రానుండడంతో ఇప్పటి నుంచే పనులు మొదలుపెట్టారు. భీమేశ్వరస్వామి ఆలయంలోని గండాదీపం ముందు భాగంలో ఉత్సవాలు నిర్వహించాలని అధికారులు ఖరారు చేశారు. అధికారులు, సిబ్బంది, అర్చకులు, భక్తులు కూర్చుండేందుకు వీలుగా ఈ ప్రాంతం అనువుగా ఉందని అధికారులు గుర్తించారు. భీమన్నగుడి ఉత్తర ద్వారం వైపు సేవలు వెళ్లేందుకు అవకాశం లేనందున గండాదీపం ముందు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు శుక్రవారం తెలిపారు.
8 నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు
భీమేశ్వర సదన్‌లో జనవరి 8 నుంచి త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఐదు రోజులపాటు నిర్వహించనున్నారు. ఓపెన్‌స్లాబ్ కూల్చివేతలు మొదలుకావడంతో భీమేశ్వర సదన్‌లోని పార్కింగ్ స్థలంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల ఎంపిక ప్రారంభించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.


