
‘చెప్పు’కున్నా తీరని బాధ
చందుర్తి(వేములవాడ): రైతుల బాధ చెప్పుకోలేని విధంగా మారింది. వరి పంట వేసి నెల రోజులు గడుస్తున్నా కొందరి రైతులకు ఇప్పటికీ యూరియా దొరక్కపోవడంతో ఆందోళన చెందుతున్నారు. తెల్లవారుజామునే సొసైటీ వద్దకు చేరుకుంటున్నారు. అయినా వారికి యూరియా దొరకడం లేదు. చందుర్తి సింగిల్‌విండో పరిధిలోని రైతులకు గత నెల 12, 13, 14 తేదీల్లో యూరియా కోసం టోకెన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు యూరియా బస్తాలు మాత్రం ఇవ్వలేదు. మంగళవారం 250 బస్తాలు రావడంతో 12, 13 తేదీల టోకెన్లు ఉన్న రైతులకే ఇవ్వలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంటిదారి పట్టారు. సనుగులలోనూ ఇదే పరిస్థితి ఉంది.