
బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందాం
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
రుద్రంగి(వేములవాడ): తెలంగాణ సాంస్కృతిక వారసత్వం బతుకమ్మ పండుగ అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. రుద్రంగి మండల కేంద్రంలో రూ.20లక్షలతో బతుకమ్మ తెప్పల నిర్మాణానికి బుధవారం భూమిపూజ చేశారు. విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రామకృష్టపూర్‌పల్లి వద్ద రూ.5లక్షలు, అచ్చయ్యకుంట వద్ద రూ.5లక్షలు, ఎల్లయ్యకుంట వద్ద రూ.10లక్షలతో బతుకమ్మ తెప్పలు నిర్మిస్తున్నట్లు వివరించారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేసేందుకు రూ.47కోట్లతో 132/33 కేవీ సబ్‌స్టేషన్ మంజూరు చేసినట్లు తెలిపారు. ఎల్లయ్యకుంట నుంచి వచ్చే ఫీడర్ ఛానల్ మరమ్మతులకు రూ.16 లక్షలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభిస్తామన్నారు. రుద్రంగి ఏఎంసీ చైర్మన్ చెలుకల తిరుపతి, గడ్డం శ్రీనివాస్‌రెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, పల్లి గంగాధర్, గండి నారాయణ, తర్రె లింగం, గంధం మనోజ్ పాల్గొన్నారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): మండలంలోని సారంపల్లి–బద్దెనపల్లి టెక్స్‌టైల్ పార్క్‌లో గత 15 రోజులుగా చేపట్టిన పవర్‌లూమ్ కార్మికులు తమ సమ్మెను విరమిస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. వారు మాట్లాడుతూ చేనేత, జౌళిశాఖ అధికారులు పవర్‌లూమ్ కార్మికులు, యజమానులకు మధ్య జరిగిన చర్చల్లో ప్రభుత్వ వస్త్రానికి మీటర్‌కు 65 పైసలు పెంచినట్లు తెలిపారు. ఈమేరకు సమ్మె విరమించి విధుల్లోకి వెళ్తున్నట్లు కార్మికులు ప్రకటించారు. చర్చల్లో చేనేత, జౌళిశాఖ ఏడీ రాఘవరావు, యజమానుల సంఘం అధ్యక్షుడు అన్నల్‌దాస్ అనిల్‌కుమార్, పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్, జిల్లా అధ్యక్షుడు కోడం రమణ, పార్కు యూనియన్ అధ్యక్షుడు కూచన శంకర్, కార్మిక నాయకులు శ్రీరాముల రమేశ్‌చంద్ర, సంపత్, శ్రీకాంత్, ఆంజనేయులు, శ్రీనివాస్, అంబదాస్, రమేశ్, నర్సయ్య పాల్గొన్నారు.

బతుకమ్మను ఘనంగా నిర్వహించుకుందాం