
200 మందితో బందోబస్తు
● ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి
వేములవాడ: పట్టణంలో గురువారం సాయంత్రం నుంచి జరిగే వినాయక నిమజ్జనోత్సవానికి 200 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి బుధవారం తెలిపారు. ప్రజలు శాంతియుత వాతావరణంలో నిమజ్జనం నిర్వహించుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు. సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుందని తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టరీత్య చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సీఐ వీరప్రసాద్, ఎస్సైలు ఉన్నారు.
సిరిసిల్ల: జిల్లాలోని ఏడు మండలాల్లో బుధవారం చిరుజల్లులు కురిశాయి. ఇల్లంతకుంటలో అత్యధికంగా 2.1 మిల్లీమీటర్లు, రుద్రంగిలో 0.4, వేములవాడ రూరల్‌లో 0.1, బోయినపల్లి లో 1.3, సిరిసిల్లలో 0.3, వీర్నపల్లిలో 1.8, గంభీ రావుపేటలో 1.5 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఇల్లంతకుంట(మానకొండూర్): సీజనల్ వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వ్యక్తిగత శుభ్రత పాటించాలని జిల్లా ఇమ్యూనైజేషన్ వైద్యాధికారి సంపత్‌కుమార్ కోరారు. మండలంలోని రహీంఖాన్‌పేట, కందికట్కూర్ పల్లె దవాఖానాలను బుధవారం తనిఖీ చేశారు. అసంక్రమిత వ్యాధుల స్క్రీనింగ్‌కు ప్రజలు సహకరించాలని కోరారు. వైద్యాధికారులు రామకృష్ణ, స్వరూప, రాజవ్వ పాల్గొన్నారు.
సిరిసిల్ల: జిల్లాలో జ్వరాల నివారణకు ఇంటింటి సర్వే చేసి మందులు పంపిణీ చేయాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత కోరారు. జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ ఆఫీస్‌లో బుధవారం జిల్లాలోని అన్ని ఆరోగ్య కేంద్రాల డాక్టర్లతో సమావేశమయ్యారు. జిల్లా వైద్యాధికారి రజిత మాట్లాడుతూ ముసురు వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీరు కలుషితమవుతుందని, ఆ నీటిని తాగితే రోగాలు వస్తాయన్నారు. తప్పనిసరిగా కాచి చల్లార్చిన నీటిని తాగాలని ప్రజలకు వివరించాలన్నారు. నీరు నిల్వ ఉంటే లార్వా పెరుగుతుందన్నారు. డ్రై డేలో భాగంగా క్షేత్రస్థాయిలో పరిసరాల పరిశుభ్రతకు తీసుకోవాల్సిన చర్యలను సూచించాలన్నారు. ప్రోగ్రాం ఆఫీసర్లు డాక్టర్ అంజలి ఆల్‌ఫ్రెడ్, అనిత, సంపత్, రామకృష్ణ, డీడీఎం కార్తీక్, అన్ని పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు.
ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి
వేములవాడరూరల్: ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత సూచించారు. వేములవాడ మండలం శాత్రాజుపల్లి, నూకలమర్రిల్లో బుధవారం వైద్యబృందం పరిశీలించారు. సీహెచ్.బాలచందర్, గంగరాజు తదితరులు పాల్గొన్నారు.
సిరిసిల్లఅర్బన్: చైన్నెలో జరిగిన జాతీయస్థాయి కిక్ బాక్సింగ్‌లో జిల్లాకు చెందిన ఐదుగురు క్రీడాకారులు పతకాలు సాధించినట్లు మాస్టర్ వొడ్నాల శ్రీనివాస్ తెలిపారు. క్రియేటివ్ ఫామ్ వెపన్ ఓల్డర్ కెడెట్ బాలికల విభాగంలో గజ్జెల శ్వేదిక ద్వితీయస్థానంలో నిలిచింది. యంగర్ కేడెట్ బాలురలో సాయింట్ ఫైట్, లైట్ కాంటాక్ట్ ఫైట్‌లో గౌతమ్ ఆనంద్ రెండు కాంస్య పతకాలు సాధించాడు. ఐదో స్థానంలో నిలిచిన కర్నె యుతిక, చోడిబోయిన శివష్, షేక్ అజహస్ మోహిద్దీన్ కింది వరుసలో నిలిచారు. విద్యార్థులను వాకో ఇండి యా కిక్ బాక్సింగ్ ఫెడరేషన్ ప్రెసిడెంట్ సంతో ష్‌కుమార్ అగర్వాల్, బాక్సింగ్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు రామాంజనేయులు అభినందించారు.

200 మందితో బందోబస్తు

200 మందితో బందోబస్తు