
క్రిస్టియన్ల సమస్యల పరిష్కారానికి చర్యలు
● రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్
సిరిసిల్ల: క్రైస్తవ, మైనార్టీల సమస్యల పరిష్కారానికి పటిష్ట చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ కోరారు. రాజన్న సిరిసిల్ల కలెక్టరేట్‌లో బుధవారం కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, జిల్లా అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడుతూ క్రైస్తవులకు భూ సమస్యలు ఉంటే సంబంధిత లింకు డాక్యుమెంట్స్ సమర్పిస్తే పరి ష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నిబంధనల ప్రకారం చర్చీల నిర్మాణానికి అవసరమైన అ నుమతులు 15 రోజుల్లోగా జారీ చేస్తామని తెలిపా రు. ప్రభుత్వ సంక్షేమ పథకాల రుణాలకు క్రిస్టియన్ మతం తీసుకున్న వారు అందరూ అర్హులవుతారన్నారు. పాస్టర్స్ మాట్లాడుతూ జిల్లాలో క్రైస్తవుల కోసం శ్మశానవాటిక, కమ్యూనిటీహాల్స్, చర్చీల నిర్మాణానికి అనువైన స్థలాలు కేటాయించాలని కో రారు. ఆర్టీవో రాధాభాయి, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఎంఏ భారతి పాల్గొన్నారు.
మహిళా రక్షణ చట్టాలపై అవగాహన
మహిళా రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని కలెక్టర్ కోరారు. మహిళల అభ్యున్నతిపై సంకల్ప్ పేరిట 10 రోజుల ప్రత్యేక కార్యక్రమాలపై ఎస్పీ మహేశ్ బి గీతేతో కలిసి సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ సెప్టెంబర్ 2 నుంచి 12 వరకు బేటి బచావో–బేటి పడావో, పీసీపీఎన్‌డీటీ యాక్టు, ఇందిరా మహిళాశక్తి, పనిచేసే చోట లైంగిక వేధింపులు, మహిళలకు అమలులో ఉన్న రక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలన్నారు. విద్యాసంస్థలు, ప్రైవేట్ సంస్థల్లో జెండర్ సెన్సిటైజేషన్ నిర్వహించాలన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీడబ్ల్యూవో లక్ష్మీరాజం, డీఈవో వినోద్‌కుమార్, డీపీవో షరీఫొద్దీన్, జిల్లా వైద్యాధికారి ఎస్.రజిత పాల్గొన్నారు.
5న జీపీవోలకు నియామకపత్రాలు
జీపీవోలుగా అర్హత సాధించిన 66 మందికి నియామకపత్రాలను హైదరాబాద్‌లో అందిస్తారని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్‌కు బస్సులో తరలిస్తారని నోడల్ అధికారిగా అదనపు కలెక్టర్ నగేశ్‌ను నియమించినట్లు చెప్పారు. సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏవో రాంరెడ్డి పాల్గొన్నారు.