● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
చందుర్తి(వేములవాడ): దేశాన్ని శాస్త్ర, సాంకేతికరంగాల్లో అభివృద్ధి సాధ్యమైందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పే ర్కొన్నారు. మర్రిగడ్డలో బుధవారం రాజీవ్‌గాంధీ జయంతి వేడుకలో పాల్గొన్నారు.
మత్స్యకారులకు ప్రభుత్వం అండ
మత్స్యకారులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. కేజీ కల్చర్ విధానంలో చేపల పెంపకానికి ముందుకొస్తే ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోందని తెలి పారు. మర్రిగడ్డలో మత్స్యకార్మికుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పచ్చళ్ల దుకాణాన్ని ప్రారంభించారు. పార్టీ మండలాధ్యక్షుడు చింతపంటి రామస్వామి, మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, తుపాకుల రవి, గుండేవేని తిరుపతి, గుండేవేని శ్రీనివాస్ పాల్గొన్నారు.
ముస్తాబాద్(సిరిసిల్ల): వెంకట్రావుపల్లెలో అసైన్డ్ భూములపై వివాదం తలెత్తింది. వెంకట్రావుపల్లె గ్రామస్తులు ప్రధాన రహదా రి వద్ద ఉన్న అసైన్డ్ భూముల వద్ద బుధవారం ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ వెంకట్రావుపల్లెలోని సర్వేనంబర్ 798లో 84 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా.. పలువురికి 60 ఎకరాల వరకు ప్రభుత్వం పట్టాలిచ్చిందని తెలిపారు. ప్రధాన రహదారిని ఆనుకుని ఉన్న 20 ఎకరాలలో కొందరు అక్రమంగా ప్రవేశించి దున్నుతున్నారన్నారు. సీఐ మొగిలి, ఎస్సై గణేశ్ ప్రత్యేక బలగాలతో వెంకట్రావుపల్లెకు చేరుకుని గ్రామస్తులను శాంతింపజేశారు. తహసీల్దార్ సురేశ్ అక్కడికి చేరుకొని.. అసైన్డ్ భూముల్లోకి ఎవరు వెళ్లవద్దని, ప్రభుత్వమే స్వాధీనం చేసుకుంటుందని స్పష్టం చేశారు.
తంగళ్లపల్లి(సిరిసిల్ల): కూలి పెంచాలంటూ బద్దెనపల్లి–సారంపల్లి టెక్స్‌టైల్ పార్క్ పవర్‌లూమ్ కార్మికులు చేస్తున్న సమ్మె బుధవారం రెండో రోజుకు చేరింది. తెలంగాణ పవర్‌లూమ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మాట్లాడుతూ కూలి పెంచే వరకు సమ్మె కొనసాగుతోందని స్పష్టం చేశారు. కూచన శంకర్, వేణు, సంపత్, కనకయ్య, వరప్రసాద్, శ్రీనివాస్, రాజు, శ్రీకాంత్, కిషన్ పాల్గొన్నారు.
వీర్నపల్లి(సిరిసిల్ల): బడి సమయానికి అనుగుణంగా బస్సులు నడపాలని కోరుతూ మండల కేంద్రంలోని మర్రిమడ్ల–ఎల్లారెడ్డిపేట రోడ్డుపై బుధవారం విద్యార్థులు ధర్నాకు దిగారు. ఎల్లారెడ్డిపేట ఎస్సై రాహుల్‌రెడ్డి సంఘటన స్థలానికి చేరుకొని విద్యార్థులను డిపోమేనేజర్‌తో మాట్లాడించారు. గురువారం నుంచి బస్సులు సమయానికి పంపిస్తామని, మోడల్‌స్కూల్‌కు ప్రత్యేక బస్సు నడుపుతామని డిపోమేనేజర్ హామీతో ధర్నా విరమించారు.
శబరిమలకు మహా పాదయాత్ర
ముస్తాబాద్(సిరిసిల్ల): శబరిమలకు 36 మంది మాలధారులు రాజుగురుస్వామి ఆధ్వర్యంలో బుధవారం మహాపాదయాత్రగా బయలు దేరారు. 1250 కిలోమీటర్లు రెండు నెలలపాటు మహా పాదయాత్ర చేయనున్నట్లు ఆలయ కమిటీ చైర్మన్ చీటి జితేందర్‌రావు తెలిపారు. బృందంలో మాజీ ఎంపీపీ జనగామ శరత్‌రావు, నాగరాజు, అంజాగౌడ్, పండరి, ఎల్లం, నారాయణ, మహేశ్, బాలాజీ, వెంకటేశ్వర్‌రావు, కృష్ణమూర్తి, స్వామి, తిరుపతి, నర్సింగరావు తదితరులున్నారు.
రాజీవ్‌గాంధీతోనే సాంకేతిక విప్లవం
రాజీవ్‌గాంధీతోనే సాంకేతిక విప్లవం
రాజీవ్‌గాంధీతోనే సాంకేతిక విప్లవం
రాజీవ్‌గాంధీతోనే సాంకేతిక విప్లవం