
హరేరామ.. హరేకృష్ణ
జగద్గురువు శ్రీ కృష్ణుడి జన్మాష్టమి సంబరాలను అంబరాన్ని తాకేలా ఘనంగా నిర్వహించారు. అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘం జిల్లాశాఖ సారథ్యంలో స్థానిక కల్యాణ లక్ష్మి గార్డెన్‌లో శుక్రవారం జరిగిన వేడుకలకు వేల సంఖ్యలో భక్తులు హాజరై తరించారు. శ్రీమాన్ ప్రాణనాథ్ అచ్యుతదాస్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. సుందరంగా అలంకరించిన రాధాకృష్ణుల ప్రతిమలకు ఊయలసేవ, నైవేద్యాలతో రాజభోగ సమర్పణ, రాజభోగ హారతి తదితర కార్యక్రమాలు జరిపారు. సాయంత్రం ధూప హారతి, మహాఅభిషేకం జరిపించారు. రాజమండ్రికి చెందిన రాయి కిషోరి కూచిపూడి నృత్య కళాక్షేత్రం ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలు అలరించింది. మహా మంగళహారతి, ప్రసాద వితరణతో జన్మాష్టమి వేడుకలు ముగిశాయి. నరోత్తమదాస్, హరిహరదాస్, మధుసూదన్‌దాస్, భక్తులు పాల్గొన్నారు. – సిరిసిల్లకల్చరల్/సిరిసిల్లటౌన్

హరేరామ.. హరేకృష్ణ