అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

Aug 15 2025 7:20 AM | Updated on Aug 15 2025 7:20 AM

అభివృ

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అవినీతిని నిర్మూలించి ప్రక్షాళన చేయాలి కఠిన శిక్షలు అమలు చేయాలి తెలివితేటల ఆధారంగా రిజర్వేషన్‌ కల్పించాలి రక్షణ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి అవినీతి రహిత దేశంగా అవతరించాలి సామాన్యుల జీవితాల్లో మార్పులేదు సాంకేతిక విజ్ఞానం నియంత్రణలో ఉండాలి విద్యకు పెద్దపీట వేయాలి

సామాజిక సమస్యలు ఇంకా నిర్మూలన కాలేదు

మానవ వనరులను మరింత మెరుగుపర్చాలి

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’ టాక్‌ షోలో విద్యార్థుల మనోగతం

సిరిసిల్లకల్చరల్‌: ఏడున్నర దశాబ్ధాల స్వాతంత్య్ర భారతదేశంలో ఇప్పటికీ మానిపోని రుగ్మతలు ఎన్నో.. బంధుప్రీతి, అవినీతి, అశ్రిత పక్షపాతం తదితర సామాజిక సమస్యలు ఇంకా నిర్మూలన కాలేదు.. అనేక రంగాల్లో పురోగతి సాధించినా జరగాల్సినంతగా జరగలేదన్నది సుస్పష్టం.. అభివృద్ధి చెందిన భారతదేశంగా చూడాలని యువతరం కలలు గంటోంది.. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈతరం యువత దేశం పురోగతిపై ఎలా ఆలోచిస్తుందనే అంశంపై సిరిసిల్లలోని వికాస్‌ డిగ్రీ కళాశాలలో ‘సాక్షి’ నిర్వహించిన టాక్‌ షోలో పాల్గొన్న విద్యార్థులు తమ మనోభావాలను వెల్లడించారు.

ఎన్నో ఏళ్లుగా అభివృద్ధి చెందుతున్న దేశంగానే కీర్తించబడుతోంది. అన్ని రంగాల్లో అవినీతిని నిర్మూలించి సమూలంగా ప్రక్షాళన చేయాలి. అభివృద్ధి చెందిన భారతదేశంగా అవతరిస్తే చూడాలని యువత ఆరాటపడుతోంది. అందుకు అనుగుణమైన పరిపాలన వ్యవస్థ రావాలి. – పోచవేని ఆర్తి, బీఎస్సీ ఫైనల్‌

దేశంలో నేర ప్రవృత్తి క్రమంగా పెరుగుతుండటం ప్రమాదకరం. కేసుల విచారణ త్వరితగతిన జరిగి నేరస్తులకు శిక్షలు పడే సమయం కుదించబడాలి. వేల సంఖ్యలో కేసులు కోర్టుల్లో పెండింగ్‌లో ఉంటున్నాయి. సత్వర విచారణ, కఠిన శిక్షలను అమలు చేయడం ద్వారా నేర ప్రవృత్తిని సమాజంలో నిర్మూలించాలి.

– గజభీంకార్‌ రాంప్రసాద్‌, బీకాం

దేశంలో అమలవుతున్న రిజర్వేషన్ల ప్రక్రియ స్వాతంత్య్రం వచ్చిన పదేశళ్ల వరకు మాత్రమే అనే నిబంధన ఉంది. వివిధ కారణాలతో ఇన్నేళ్లు కొనసాగిస్తున్నారు. మతం ఆధారంగా కాకుండా తెలివితేటల ప్రాతిపదికన రిజర్వేషన్లు అమలు చేసే ప్రయత్నాలు జరగాలి.

– ఎండీ షానవాజ్‌, బీబీఏ

దేశ రక్షణ విషయంలో రాజీ పడే పరిస్థితి ఉండొద్దు, దాయాది దేశాల కవ్వింపు చర్యల వల్ల అస్థిరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇండియా వైపు కన్నెత్తి చూడాలంటేనే వణికిపోయేలా అత్యాధునిక రక్షణ పరికరాలు మరిన్ని తయారు కావాలి. దేశ రక్షణ యంత్రాంగం ఎంత పటిష్టంగా ఉంటే అంతగా అభివృద్ధికి మార్గం సులువవుతుంది.

– గొడుగు నీరజ, బీఎస్సీ డేటా సైన్స్‌

దేశంలో అవినీతి పేరుకుపోయింది. సంబంధిత శాఖ తనిఖీలు జరుపుతున్నా నేరస్తుల జాబితా పెరుగుతూనే ఉంది. పేదవర్గాలు పుష్కలంగా ఉన్న దేశంలో ఆరోగ్యం అందని ద్రాక్షగా ఉంటోంది. నేర చరిత గల నేతలను ఎన్నికల్లో పాల్గొనకుండా నిరోధించాలి.

– సింగారం చందు, బీకాం ఫైనల్‌

దేశంలో టెక్నాలజీ పెరుగుతున్నప్పటికీ సామాన్యుల జీవితాల్లో పెద్దగా మార్పులేవీ లేవు. కనీసం నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులో ఉండడం లేదు. మంచినీళ్లు కొనుక్కొని తాగే దుస్థితి కనిపిస్తోంది. నాణ్యమైన విద్య అందించడం ద్వారా మానవ వనరులను సమర్థంగా వినియోగించుకునే వ్యవస్థ రావాలి.

– కొట్టె శివభవాని, బీఎస్సీ ఫైనల్‌

నియంత్రిత సాంకేతికత అందుబాటులోకి రావాలి. మరిన్ని కొత్త ఆవిష్కరణలు జరగాలి. సాధారణ ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పులు చోటు చేసుకునేలా సాంకేతిక విజ్ఞానం అదుపులో ఉండాలి. సామాజిక మాధ్యమాల వినియోగంపై నియంత్రణ ఉండాలి.

– గంగు మహేశ్‌, బీకాం

పేద వర్గాలకు విద్య, వైద్యం ఉచితంగా అందేలా చూడాలి. ఉచిత పథకాలు అట్టడుగు వర్గాల వారికే పరిమితం చేయాలి. యువతకు నాణ్యమైన ఉచిత విద్య అందించడం ద్వారా స్వయం సమృద్ధి సాధించే దిశగా ప్రణాళికలు రచించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఉచిత రవాణ సౌకర్యం కల్పించాలి.

– వేముల నిరోషా, బీఎస్సీ డేటా సైన్స్‌

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి1
1/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి2
2/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి3
3/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి4
4/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి5
5/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి6
6/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి7
7/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి8
8/8

అభివృద్ధి చెందిన దేశంగా చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement