
పంద్రాగస్టుకు ముస్తాబు
సిరిసిల్ల: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు పోలీసు ఆఫీస్ (డీపీవో) ఆవరణలోని పరేడ్ గ్రౌండ్ ముస్తాబైంది. శుక్రవారం జరిగే వేడుకల ఏర్పాట్లను గురువారం సాయంత్రం సిరిసిల్ల ఆర్డీవో సీహెచ్. వెంకటేశ్వర్లు, తహసీల్దార్ సురభి మహేశ్‌కుమార్‌లు పర్యవేక్షించారు. వేడుకలకు ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొంటుండగా కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బి గితే, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు హాజరవుతారు. ఉదయం 9.30 గంటలకు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. 9.32 గంటలకు పోలీస్ గౌరవ వందనం, 9.40లకు ముఖ్యఅతిథి సందేశం, 9.55లకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10.25 గంటలకు వివిధ రంగాల్లో కృషి చేసిన వారికి ప్రశంసా పత్రాల ప్రధానం, 11.02 గంటలకు కార్యక్రమం ముగుస్తుంది.
శిథిలాల తొలగింపునకు ముహూర్తం ఖరారు
వేములవాడ: వేములవాడ మేన్‌రోడ్డు 80 ఫిట్ల విస్తరణ చేసే క్రమంలో రోడ్డుకు ఇరువైపులా దాదాపు 254 నిర్మాణాలను అధికారులు కూల్చేశారు. జూన్ 15న ప్రారంభమైన ఈ ప్రక్రియ కోర్టు స్టేలతో కాస్త నిలిచినా చివరికి పూర్తిస్థాయిలో పూర్తయ్యాయి. కూల్చివేసిన శిథిలాలు అలాగే ఉండిపోయాయి. అధికారులు శిథిలాలల నుంచి వచ్చిన వ్యర్థాలను దూర ప్రాంతాలకు తరలించేందుకు రూ.22 లక్షలతో ఆన్‌లైన్ టెండర్లను పిలిచారు.
45.5 లెస్‌కు టెండర్ పైనల్
రూ. 22 లక్షలతో టెండర్లకు ఆహ్వానించిన మున్సిపల్ అఽధికారులకు ఆన్‌లైన్‌లో 12 మంది టెండర్లు దాఖలు చేశారు. ఈనెల 11తో గడువు ముగియడంతో గురువారం టెండర్ల ప్రక్రియను క్లియర్ చేసినట్లు మున్సిపల్ కమిషనర్ అన్వేష్ తెలిపారు. 45.5 శాతం లెస్‌కు హైదరాబాద్‌కు చెందిన విజయ ఎర్త్ మూవర్స్ సంస్థకు టెండర్‌ను అప్పగించామని అన్నారు. శుక్రవారం నుంచి స్క్రాప్‌ను తొలగించే పనులు ప్రారంభించి నెల రోజుల్లోగా పూర్తిగా క్లీన్ చేసి ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిపారు. భవనాల శిథిలాలను ఎస్పీ కార్యాలయం ప్రాంతంలో డంప్ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. కాగా పట్టణ శివారులోని కాలనీల్లో చాలా వరకు వర్షపు నీరు నిలుస్తూ కాలనీవాసులు నానాఅవస్థలు పడుతున్నారు. ఈక్రమంలో ఈవ్యర్థాలను శివారు కాలనీల్లోని రోడ్లలో వేయాలని స్థానికులు కోరుతున్నారు.
సింగిల్‌విండోల
పదవీకాలం పొడిగింపు
సిరిసిల్ల అర్బన్: జిల్లాలోని 24 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం మరో ఆరు నెలల పాటు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 14వ తేదీతో పాలకవర్గాల గడువు ముగియనున్న నేపథ్యంలో మరో ఆరునెలల గడువు పొడిగింపుతో సింగిల్‌విండోల అధ్యక్షులు హర్షం వ్యక్తం చేశారు. ఆగస్టు 15న జెండాను ఎగుర వేసే అవకాశం లభించిందని పేర్కొంటున్నారు.
యూరియా కోసం ఆందోళన
వీర్నపల్లి(సిరిసిల్ల): మండల కేంద్రం వీర్నపల్లిలో యూరియా కోసం రైతులు ఆందోళన చేశారు. సింధూర మండల సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సీడ్స్ అండ్ ఫర్టిలైజర్స్ షాపును గురువారం ప్రారంభించిన జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఏఎంసీ చై ర్మన్ రాములుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి అ ఫ్జల్ బేగం మాట్లాడుతూ షాపులో 225 యూ రియా బస్తాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని మిగతా స్టాకు త్వరలో ఏర్పాటు చేస్తామని తెలపడంతో యూరియా సరఫరా చేయకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. నాలుగైదు రోజుల్లో యూరి యాను అందుబాటులోకి తీసుకొస్తామని అ ధికారులు వెల్లడించారు. కార్యక్రమంలో తహసీల్దార్ ముక్తర్ పాషా, మండల అభివృద్ది అధికారి బీరయ్య, నాయకులు పాల్గొన్నారు.

పంద్రాగస్టుకు ముస్తాబు

పంద్రాగస్టుకు ముస్తాబు