
ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ గద్దె దిగాలి
● ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సిరిసిల్లటౌన్: దొంగ ఓట్లతో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తూ గద్దె దిగాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నా రు. గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సిరిసిల్ల లోని పాత బస్టాండ్ నుంచి అంబేడ్కర్ చౌరస్తా మీదుగా గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ శ్రీనివాస్ పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున కా ర్గే, సోనియా గాంధీ ఆధ్వర్యంలో బీజేపీ ప్రజల ఓట్లను కొల్లగొడుతూ గెలుస్తున్న స్థితిగతులను కండ్లకు గట్టినట్లు వీడియో రూపంలో చూపించారని అన్నారు. బీజేపీ ప్రభుత్వం పార్లమెంట్‌లో ప్రశ్నించే గొంతుకులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని నిరసిస్తూ ఆల్ ఇండియా కాంగ్రెస్, టీపీసీసీ పిలుపుమేరకు ఓటు చోర్ గద్దె చోడ్ నినాదంతో క్యాండిల్ ర్యాలీ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, ఏఎంసీ చైర్మన్ స్వరూపరెడ్డి, టీపీసీసీ కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.