
భగీరథ.. ఇదేం వ్యథ
సిరిసిల్ల పెద్దూరు డబుల్‌బెడ్రూం ఇళ్లలో ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రావడం లేదు. 43 బ్లాకుల్లో నివసిస్తున్న 516 కుటుంబాలకు సరిపడా నీళ్లు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటున్నారు. నీటి కోసం మున్సిపల్ కమిషనర్‌కు ఫోన్ చేయడంతో ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. వచ్చిన ట్యాంకర్ల నీటి సామర్థ్యం సరిపోవడం లేదు. దీంతో నీటి కోసం ఎగబడుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి నీటి సమస్య తీర్చాలని కోరుతున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, రాజన్న సిరిసిల్ల జిల్లా