
స్వాతంత్రోద్యమం నుంచి కాంగ్రెస్ ప్రజాపక్షమే
సిరిసిల్లటౌన్: రాష్ట్రప్రభుత్వం అందజేస్తున్న పథకాలను ప్రతి కార్యకర్త ప్రజలకు చేరవేయాలని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సూచించారు. సిరిసిల్లలోని డీసీసీ కార్యాలయంలో శుక్రవారం జాతీయ జెండా ఆవిష్కరించి మాట్లాడారు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ, జవహర్ లాల్ నెహ్రూ అనేక పోరాటాలు చేసి స్వతంత్య్రాన్ని సాధించారన్నారు. తెలంగాణ రాష్ట్ర కళను ఇప్పుడు సోనియాగాంధీ నెరవేర్చారన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణగౌడ్, సంగీతం శ్రీనివాస్, చొప్పదండి ప్రకాశ్, ఆకునూరి బాలరాజు, గడ్డం నర్సయ్య, వెల్ముల స్వరూపరెడ్డి, కాముని వనిత, ఆడెపు చంద్రకళ, కల్లూరి చందన పాల్గొన్నారు.
మహిళలు ఆర్థికంగా ఎదగాలి
ఇల్లంతకుంట: మహిళలు అన్ని రంగాలలో ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో ఆవని గ్రామైక్య మహిళా సంఘం ఏర్పాటుచేసిన ఫర్టిలైజర్ షాపును శుక్రవారం ప్రారంభించారు. షాపులో 450 యూరి యా బస్తాలు అందుబాటులో ఉన్నాయన్నారు. కందికట్కూర్ గ్రామ మహిళా సంఘాల వారు తమకు నూతన భవనం కావాలని ఎమ్మెల్యేను కోరగా మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. ఇల్లంతకుంటలోని 50పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణం పనులు పరిశీలించారు. డీఆర్‌డీవో శేషాద్రి, డీఏవో అఫ్జల్‌బేగం, ఐకేపీ ఏపీఎం లతా మంగేశ్వరి, కాంగ్రెస్ మండలాధ్యక్షుడు కే.భాస్కర్ రెడ్డి, గుడిసె ఐలయ్య, తీగల పుష్పలత, చిట్టి ఆనందరెడ్డి పాల్గొన్నారు.
ప్రెసిడెంట్ మెడల్ అందుకున్న ఏఎస్పీ చంద్రయ్య
సిరిసిల్ల క్రైం: సిరిసిల్ల అడిషనల్ ఎస్పీ చంద్రయ్య ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేతుల మీదుగా ప్రెసిడెంట్ పోలీస్ మెడల్ అందుకున్నారు. ఆయన్ను ఎస్పీ మహేష్ బీ గితే అభినందించారు. 1991 లో ఎస్సైగా పోలీస్‌శాఖలో చేరిన డి.చంద్రయ్య వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేశారు. 2007లో సీఐగా, 2017లో డీఎస్పీగా పదోన్నతి పొందా రు. 2021 లో అదనపు ఎస్పీగా పదో న్నతి పొంది సిరిసిల్ల జిల్లా అదనపు ఎస్పీగా కొనసాగుతున్నారు. సేవ పతకం, ఉత్తమసేవ పతకాలతో మహోన్నత సేవాపతకం అందుకున్నారు. 34 ఏళ్ల సుదీర్ఘ సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ప్రెసిడెంట్ సర్వీస్ మెడల్‌కి ఎంపిక చేసింది.
జిల్లాలో చిరు జల్లులు
సిరిసిల్ల: జిల్లాలో శుక్రవారం చిరు జల్లులు కురి శాయి. ఎల్లారెడ్డిపేటలో 4.5 మిల్లీ మీటర్ల వర్షం పడగా.. ఇల్లంతకుంటలో 4.0, గంభీరావుపేటలో 2.5, సిరిసిల్లలో 2.3, కోనరావుపేటలో 2.3, రుద్రంగిలో 1.5, ముస్తాబాద్‌లో 1.3, తంగళ్లపల్లిలో 1.3, వేములవాడలో 1.3 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. మిగితా మండలాల్లో పెద్దగా వర్షం పడలేదు.

స్వాతంత్రోద్యమం నుంచి కాంగ్రెస్ ప్రజాపక్షమే

స్వాతంత్రోద్యమం నుంచి కాంగ్రెస్ ప్రజాపక్షమే