
కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో
సిరిసిల్ల: కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా జాతీయజెండాను ఎగురవేశారు. జాతీయ గీతాన్ని ఆలపించిన చిన్నారులకు బహుమతులు అందించారు. అదనపు కలెక్టర్ నగేశ్, ఆర్డీవో సీహెచ్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ సెక్షన్ ఇన్‌చార్జీలు పాల్గొన్నారు.
ఎస్పీ కార్యాలయంలో
సిరిసిల్ల క్రైం: జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో ఎస్పీ మహేష్ బి గితే జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసు అధికారులు జాతి సమగ్రత, సమాజంలో శాంతిస్థాపనకు కృషి చేయాలన్నారు. డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
17వ బెటాలియన్‌లో
సిరిసిల్ల అర్బన్: సిరిసిల్ల పట్టణ పరిధిలోని సర్దాపూర్ 17వ బెటాలియన్‌లో కమాండెంట్ ఎం.ఐ సురేశ్ జాతీయ జెండాను ఎగురవేశారు. సిరిసిల్ల మార్కెట్ కమిటీ సర్దాపూర్‌లో, రైతు బజారులో మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు వెలుముల స్వరూప జాతీయజెండాను ఎగురవేశారు.
మధ్య మానేరులో
వేములవాడఅర్బన్: వేములవాడ మండలం చీర్లవంచకు చెందిన మత్స్యకారులు మిడ్ మానేరు ప్రాజెక్ట్ నీటిలోని పాత చీర్లవంచలోకి తెప్పలతో వెళ్లి జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చా టుకున్నారు. గంగు ఎల్లయ్య, శ్రీకాంత్, అనంద్, అకాశ్, అజయ్, సంజయ్, ప్రవీణ్ ఉన్నారు.
డ్రోన్‌పై మువ్వన్నెలు
బోయినపల్లి: బోయినపల్లి మండలం తడగొండలో స్వాతంత్య్ర దినోత్సవం వేళ డ్రోన్‌పై జాతీయజెండాతో వినూత్న పద్ధతిలో చేనుకు మందు పిచికారీ చేశారు. గ్రామానికి చెందిన చిందం శ్రీనివాస్, కొడారి శివ డ్రోన్‌పై జాతీయ జెండాతో వరిచేనులో స్ప్రే చేశారు.

కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో

కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో

కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో

కలెక్టర్ క్యాంపు ఆఫీస్‌లో