
యూరియా కోసం బారులు
రైతులకు యూరియా కష్టాలు తప్పడం లేదు. వీర్నపల్లి మండలకేంద్రానికి 660 బస్తాల యూరియా వచ్చిన విషయం తెలుసుకుని కంచర్ల, మద్దిమల్ల, రంగంపేట గ్రామాల నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. అధికారులు వారిని క్యూలో నిల్చోబెట్టి, పోలీసుల బందోబస్తు మధ్య ఒక్కో ఆధార్‌కార్డుకు రెండు బస్తాలు ఇవ్వడంతో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. గంభీరావుపేట మండలం కొత్తపల్లి సింగిల్‌విండో కార్యాలయం ఎదుట రైతులు యూరియా బస్తాల కోసం బారులు తీరారు. కొంత మంది రైతులు చెప్పులు, బండరాళ్లను సైతం క్యూలో పెట్టారు. – వీర్నపల్లి/గంభీరావుపేట(సిరిసిల్ల)