వదిలేశారు | - | Sakshi
Sakshi News home page

వదిలేశారు

Aug 13 2025 5:04 PM | Updated on Aug 13 2025 5:04 PM

వదిలే

వదిలేశారు

బుధవారం శ్రీ 13 శ్రీ ఆగస్టు శ్రీ 2025
వార్నింగ్‌తో
● ‘ఫేక్‌ అటెండెన్స్‌’ ఇచ్చిన వారికి సర్క్యులర్‌ జారీ ● మరోసారి చెయొద్దని స్పష్టం ● ఊపిరి పీల్చుకున్న 33 మంది కార్యదర్శులు

సిరిసిల్ల: గ్రామపంచాయతీల్లో విధులు నిర్వహించకుండానే నిర్వహించినట్లుగా, క్షేత్రస్థాయిలో ఉండకుండానే.. ఉన్నట్లుగా ఫేక్‌ అటెంటెన్స్‌ ఇచ్చిన గ్రామపంచాయతీ కార్యదర్శులు ఊపిరి పీల్చుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 33 మంది పంచాయతీ కార్యదర్శులపై జిల్లా పంచాయతీ అధికారులు నివేదిక సిద్ధం చేసి కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝాకు పంపించగా.. వార్నింగ్‌తో వారిని వదిలేశారు. మరోసారి తప్పు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పొరుగు జిల్లాలో ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేసిన వ్యవహారంలో సదరు గ్రామపంచాయతీ కార్యదర్శులపై సస్పెన్షన్‌ వేటు పడింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని 33 మంది పంచాయతీ కార్యదర్శులు ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్‌ ఎలాంటి చర్యలు తీసుకుంటారని భయంతో వణికిపోయారు. పంచాయతీ కార్యదర్శుల ఫేక్‌ అటెండెన్స్‌ నమోదులో యాప్‌ లోపాలు వెల్లడి కావడంతో కలెక్టర్‌ లోతుగా విశ్లేషించారు. ఈమేరకు మొదటి తప్పిదంగా భావించి వార్నింగ్‌ ఇవ్వాలని సూచించారు. మరోవైపు మరోసారి ఈ తప్పు చేయకుండా కట్టడి చేయాలని కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

సాంకేతిక లోపమే కారణమైంది

క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉంటూ.. సమయపాలన పాటిస్తూ.. విధులు నిర్వహించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసే చోటి నుంచి నిత్యం గ్రామపంచాయతీ కార్యదర్శులు డీఎస్‌ఆర్‌ (డైలీ శానిటేషన్‌ రిపోర్టు) యాప్‌లో సెల్ఫీ దిగి తమ హాజరు నమోదు చేయాలని నిర్దేశించింది. యాప్‌లో సాంకేతిక లోపాలను అలుసుగా తీసుకున్న కొందరు గ్రామపంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేస్తూ ఉన్నతాధికారులను తప్పుదోవ పట్టించారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 32 మంది పంచాయతీ కార్యదర్శులు ఫేక్‌ అటెండెన్స్‌ నమోదు చేస్తున్నట్లు అధికారుల విచారణలో తేలింది. గ్రామపంచాయతీలకు పాలకవర్గాలు లేని రోజుల్లో అన్నీ తామై నడిపించాల్సిన పంచాయతీ కార్యదర్శులు ఇలా ఫేస్‌ రికగ్నిషన్‌ యాప్‌లో ఫేక్‌ వ్యక్తులతో అటెండెన్స్‌ నమోదు చేయడం జిల్లాలో చర్చనీయాంశమైంది.

పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ సీరియస్‌

క్షేత్రస్థాయిలో ఫేక్‌ అటెంటెన్స్‌పై పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ సృజన సీరియస్‌ అయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ముఖ గుర్తింపు యాప్‌లో నమోదైన పంచాయతీ కార్యదర్శులు ఫొటోలను పరిశీలించాలని ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా యాప్‌లను తనిఖీ చేసి నివేదికలు ఇవ్వాలని మండల పంచాయతీ అధికారులు(ఎంపీవో)లకు స్పష్టం చేశారు. నకిలీ హాజరు నమోదు చేసే పంచాయతీ కార్యదర్శులను సస్పెండ్‌ చేయాలని పంచాయతీరాజ్‌ డైరెక్టర్‌ సృజన ఆదేశించారు. ఈ మేరకు రాజన్న సిరిసిల్ల జిల్లాలోనూ డీఎస్‌ఆర్‌ యాప్‌ను అధికారులు పరిశీలించి నివేదించగా కలెక్టర్‌ సూచనతో వార్నింగ్‌తో వదిలేశారు. అదే పొరుగు జిల్లాల్లో కఠిన చర్యలు తీసుకున్నారు. రాజన్న సిరిసిల్లలో గ్రామపంచాయతీ కార్యదర్శుల పనితీరుపై నమ్మకంతో కలెక్టర్‌ సానుకూలమైన నిర్ణయంతో వార్నింగ్‌తో వదిలేయడం విశేషం.

న్యూస్‌రీల్‌

వదిలేశారు1
1/3

వదిలేశారు

వదిలేశారు2
2/3

వదిలేశారు

వదిలేశారు3
3/3

వదిలేశారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement