
వర్షాలతో అప్రమత్తం
● కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ● టోల్‌ఫ్రీ నంబర్ 93986 84240 ● ఉద్యోగుల సెలవులు రద్దు
సిరిసిల్ల/వేములవాడఅర్బన్: కుంభవృష్టి వర్షాలు కురిసే అవకాశం ఉన్నందునా అధికారులు, ఉద్యోగుల సెలవులు రద్దు చేస్తున్నామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా ప్రకటించారు. కలెక్టరేట్‌లో మంగళవారం సమీక్షించారు. జిల్లాలో లోతట్టు ప్రాంతాలలో వరదలు వచ్చే అవకాశం ఉందని.. ప్రజలను అప్రమత్తం చేసి, సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అధికారులు 24 గంటలు అందుబాటులో ఉండాలని సూచించారు. కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్‌నంబర్ 93986 84240 ఏర్పాటు చేసి పోలీస్, రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉండాలని ఆదేశాలు జారీ చేశారు. అంతకుముందు సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఈ సమీక్ష సమావేశంలో ఆర్డీవో వెంకటేశ్వర్లు, రాధాబాయి, సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, డీఏవో అఫ్జల్‌బేగం, మున్సిపల్ కమిషనర్ ఖదీర్ పాషా, అన్వేషన్, డీపీవో షరీఫొద్దీన్, ఇరిగేషన్ ఈఈ ప్రశాంత్, మిషన్ భగీరథ ఈఈ జానకీ తదితరులు పాల్గొన్నారు.
స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు
కలెక్టరేట్‌లో స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేయాలని జిల్లా అధికారులను కలెక్టర్ ఆదేశించారు. సంబంధిత అధికారులతో రాత్రి సమీక్షించారు. ఆగస్టు 15న శుక్రవారం నిర్వహించే స్వాతంత్య్ర వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలి
విద్యార్థులకు నాణ్య మైన భోజనం అందించాలని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా పేర్కొన్నారు. వేములవాడలోని మహా త్మా జ్యోతిబాపూలే బాలికల రెసిడెన్షియల్ విద్యాసంస్థను మంగళవారం తనిఖీ చేశారు. కిచెన్, స్టోర్ రూమ్‌లను పరిశీలించారు. నాణ్యమైన భోజనం పెడుతున్నారా? లేదా?, వసతి ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కొందరు టీచర్లు సక్రమంగా పాఠాలు బోధించలేకపోవడం గమనించి, పలు సూచనలు చేశారు. పాఠశాలకు అవసరమైన 30 బెంచీలను ఇతర విద్యాలయాల నుంచి తెప్పించాలని సూచించారు. ప్రిన్సిపాల్ శ్యామల, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉన్నారు.