
నిధులు విడుదల చేయండి
● సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ విప్ విన్నపం
వేములవాడ: నియోజకవర్గ పరిధిలో అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని సీఎం రేవంత్‌రెడ్డికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ విన్నవించారు. హైదరాబాద్‌లోని సీఎం నివాసంలో మంగళవారం కలిసి ఈమేరకు వినతిపత్రం అందజేశారు. కలికోట సూరమ్మ చెరువు కుడి, ఎడమ కాలువల నిర్మాణానికి భూసేకరణకు నిధులు, చందుర్తి–మోత్కురావుపేట రోడ్డు నిర్మాణానికి, మూలవాగుపై వంతెనల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కోరినట్లు తెలిపారు.
అత్యవసర సేవల్లో నిర్లక్ష్యం వద్దు
సిరిసిల్లటౌన్: అత్యవసర వేళల్లో క్షతగాత్రులకు వైద్యసేవలు అందించే 108 సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్యాధికారిణి రజిత సూచించారు. జిల్లాలోని 108 అత్యవసర సర్వీసుల సేవలను మంగళవారం పరిశీలించి మాట్లాడారు. వాహనంలోని అత్యవసర వైద్య పరికరాలను పరిశీలించారు. ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ నయీమ్ జహ, 108 ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రోగ్రాం మేనేజర్ జనార్దన్, జిల్లా మేనేజర్ అరుణ్‌కుమార్, 108 వాహన సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నిత్యాన్నదాన ట్రస్టుకు రూ.5 లక్షల విరాళం
వేములవాడ: రాజన్న నిత్యాన్నదాన ట్రస్టుకు జగిత్యాల జిల్లాకు చెందిన ముస్కు కార్తీక్‌రెడ్డి–సుష్మ దంపతులు వారి పిల్లలు ఆరుష్, కియాన్‌ల పేరిట రూ.5లక్షలు విరాళం ఆలయ ఈవో రాధాభాయికి మంగళవారం అందజేశారు. ప్రొటోకాల్ ఏఈవో అశోక్‌కుమార్, పర్యవేక్షకులు శ్రీనివాస్‌శర్మ, ప్రొటోకాల్ విభాగం సీనియర్ అసిస్టెంట్ బొడుసు మహేశ్ పాల్గొన్నారు.
గ్రంథాలయాల్లో వసతులు కల్పిస్తాం
● జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మన్ సత్యనారాయణ
ముస్తాబాద్(సిరిసిల్ల): జిల్లాలో గ్రంథాలయాలలో వసతులు కల్పిస్తామని గ్రంథాలయసంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ పేర్కొన్నారు. ముస్తాబాద్ గ్రంథాలయాన్ని మంగళవారం సందర్శించిన సందర్భంగా మాట్లాడారు. జిల్లాలోని లైబ్రరీలలో మరుగుదొడ్లు, నీరు, కరెంట్ సదుపాయాల కల్పనకు రూ.10లక్షలతో ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు వివరించారు. కాంగ్రెస్ మండలాధ్యక్షుడు యెల్ల బాల్‌రెడ్డి, ఏఎంసీ చైర్‌పర్సన్ తలారి రాణి, జిల్లా కార్యదర్శి కొండం రాజిరెడ్డి, గజ్జెల రాజు, అనిత పాల్గొన్నారు.
భూసార పరీక్షలు చేయించుకోవాలి
గంభీరావుపేట(సిరిసిల్ల): భూసార పరీక్షల ఆధారంగా పంటలు సాగు చేసుకోవాలని నాఫ్స్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు కోరారు. గంభీరావుపేట సింగిల్‌విండో కార్యాలయంలో క్రిభ్‌కో భారతి ఆధ్వర్యంలో మంగళవారం రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. రవీందర్‌రావు మాట్లాడుతూ.. రైతులు మోతాదుకు మించి యూరియా వాడొద్దన్నారు. సభ్యుల సంక్షేమమే లక్ష్యంగా సంస్థ ద్వారా 13 జిల్లాలో వ్యవసాయ ఉత్సవం నిర్వహిస్తున్నామని సంస్థ రాష్ట్ర ఎండీ నితిన్ తెలిపారు. కేడీసీసీబీ డైరెక్టర్ భూపతి సురేందర్, క్రిభ్‌కో సంస్థ జిల్లా మేనేజర్ ప్రేమ్ తేజ, పెట్రోలియం సంస్థ ప్రతినిధులు దాన్విందర్ సింగ్, శ్రావణ్‌కుమార్, సెస్ మండల డైరెక్టర్ నారాయణరావు పాల్గొన్నారు.

నిధులు విడుదల చేయండి

నిధులు విడుదల చేయండి