
సేవలకు పురస్కారం
ఇల్లంతకుంట(మానకొండూర్): మహిళా సంఘంలోని సభ్యుల ఆర్థికాభివృద్ధి.. రుణాల చెల్లింపుల్లో ఆదర్శం.. ఉపాధి కల్పనలో ముందుచూపు.. ఇవన్నీ తోడవడంతో ఇల్లంతకుంట ఆదర్శ మండలి సమాఖ్య ఆత్మనిర్భర్ సంఘతన్ పురస్కారానికి ఎంపికై ంది. ఇప్పటికే ప్రకటించిన ఈ అవార్డును స్వాతంత్య్ర వేడుకల్లో ఢిల్లీ అందజేయనున్నారు. ఈ పురస్కారాన్ని అందుకునేందుకు మహిళా సమాఖ్య అధ్యక్షురాలు, మాజీ అధ్యక్షురాలు, డీఆర్డీవో అధికారి ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు.
ఆదర్శం మహిళా మండలి సమాఖ్య
ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా మండలి సమాఖ్య 2004లో ఏర్పాటైంది. 12,420 మంది సభ్యులు, 1,103 స్వశక్తి సంఘాలు, 46 గ్రామైక్య సంఘాలతో కొనసాగుతోంది. రుణాల పంపిణీ, రికవరీలో ఉత్తమ సేవలు, స్వయం ఉపాధి కల్పించడంలో విశేష కృషి, క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేయడంతో ఈ సమాఖ్య కేంద్ర గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రకటించిన ఆత్మనిర్భర్ సంఘతన్ అవార్డుకు ఎంపికై ంది. ఇప్పటి వరకు ఈ సమాఖ్య రూ.59కోట్ల రుణాలు పంపిణీ చేసి, 99 శాతం రికవరీ చేసింది.
ఇందిరా మహిళా శక్తి పథకం కింద
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరా మహిళాశక్తి కింద మండలంలోని ఆయా గ్రామైక్య సంఘాలకు రూ.1.30కోట్లు స్వయం ఉపాధి రుణాలు మంజూరు చేసింది. ఇందులో క్యాంటీన్లు, కుట్టుమిషన్లు, కోడిపిల్లల పెంపకం వంటివి కొనసాగుతున్నాయి. సభ్యులకు లోన్ బీమా సౌకర్యం కల్పించి 20 మందికి రూ.14.80 లక్షలు అందజేశారు. మండలి సమాఖ్య కేంద్రంలో వ్యవసాయ పరికరాలు వరిగడ్డి చుట్టే యంత్రం, రొటోవేటర్, విత్తనాలు చల్లే యంత్రములు కావలసిన రైతులకు అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందుతున్నారు. రబీ సీజన్లో గ్రామైక్య సంఘాలకు వడ్ల కొనుగోలు కేంద్రాల బాధ్యత అప్పగించడం ద్వారా సంఘాలకు రూ.కోటి కమీషన్ వచ్చింది.
గ్యాస్ ఏజెన్సీ, బస్సు
ఇల్లంతకుంట మండల ఆదర్శ మహిళా సమాఖ్యకు నిరంతరం ఆదాయం వచ్చేలా గ్యాస్ ఏజెన్సీ మంజూరు చేస్తానని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా హామీ ఇచ్చారు. రూ.36లక్షలతో బస్సు కొనుగోలు చేసి ఆర్టీసీలో అద్దెకు ఇవ్వగా నెలకు రూ.59వేలు ఆదాయం వస్తోంది.
ఆత్మ నిర్భర్ పురస్కారానికి ఎంపిక
ఆర్థిక క్రమశిక్షణతో గుర్తింపు
ఢిల్లీకి వెళ్ల్లిన ఇల్లంతకుంట ఆదర్శ మండలి సమాఖ్య అధ్యక్షురాలు
స్వాతంత్య్ర వేడుకల్లో అవార్డు ప్రదానం
ఇందిరా మహిళా శక్తితో ఆదాయం
నేను ఆదర్శ మండలి సమాఖ్యలో సభ్యురాలిని. నా భర్త గీతా కార్మికుడు. ఆయన చనిపోవడంతో ఇద్దరూ పిల్లలతో సంసారం ఎల్లుడు కష్టమైంది. ఇందిరా మహిళాశక్తి కింద రూ.3లక్షలు రుణం తీసుకొని క్యాంటీన్ పెట్టుకున్నాను. మంచి ఆదాయం వస్తోంది. రుణ వాయిదాలు చెల్లిస్తూ పిల్లలను చదివిస్తున్నాను.
– బండారి స్వాతి, ఇల్లంతకుంట

సేవలకు పురస్కారం

సేవలకు పురస్కారం