
ప్రతీ కూలీకి ‘ఉపాధి’ కల్పించాలి
● డీఆర్డీవో శేషాద్రి
బోయినపల్లి(చొప్పదండి): జాబ్‌కార్డు ఉన్న ప్రతీ కూలీకి ఉపాధిహామీ పని కల్పించాలని డీఆర్డీవో శేషాద్రి పేర్కొన్నారు. మండల పరిషత్‌లో మంగళవారం మండలస్థాయి ఉపాధిహామీ 16వ విడత సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. డీఆర్డీవో శేషాద్రి మాట్లాడుతూ ఏడాదిలో రూ.6.28 కోట్ల పనులు జరిగినట్లు తెలిపారు. వేతనాలు రూ.2.94 కోట్లుగా, మెటీరియల్ కాంపోనెంట్ రూ.4.37 కోట్లుగా పేర్కొన్నారు. సామాజిక తనిఖీలో ఉపాధిహామీ కూలీ మస్టర్‌పై సరైన సంతకం ఉందా లేదా అనే అంశం.. అలాగే మెజర్మెంట్‌ను డీఆర్పీలు తనిఖీ చేసి నివేదిక అందజేశారన్నారు. జరిమానాలు రూ.4 వేలు, రికవరీ రూ.12,162గా గుర్తించినట్లు తెలిపారు. జెడ్పీ సీఈవో వినోద్, ఎంపీడీవో జయశీల, డీవీవో రామారావు, అంబుడ్స్‌పర్సన్ రాకేశ్, ఎస్సార్పీ దేవేందర్, ఏపీవో సబిత తదితరులు పాల్గొన్నారు.