
సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపి
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ప్రభుత్వ పాఠశాలల్లో పదోతరగతి విద్యార్థులు సైకిళ్లను సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి పేర్కొన్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు ఉపయోగపడతాయన్నారు. ఎల్లారెడ్డిపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్‌కుమార్ జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ కానుకగా 100 సైకిళ్లను మండలంలోని 9 పాఠశాలల్లోని విద్యార్థులకు అందజేశారు. ఎంఈవో కృష్ణహరి, హెచ్‌ఎం మనోహరాచారి, బీజేపీ మండల అధ్యక్షుడు రేపాక రామచంద్రారెడ్డి, నాయకులు పొన్నాల తిరుపతిరెడ్డి, మద్దుల బుగ్గారెడ్డి, చందుపట్ల లక్ష్మారెడ్డి, గంట బాలకృష్ణాగౌడ్, దాసరి గణేష్, నంది నరేశ్, రాజిరెడ్డి, సంజీవరెడ్డి, ఆంజనేయులు, దాసరి పూర్ణిమ, బాలాగౌడ్, కిరణ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.