
పుస్తెలమ్మినా సరిపోతలేవు
మాది తంగళ్లపల్లి మండలం ఇందిరమ్మకాలనీ. మొదటి సంతానం నార్మల్ డెలివరీ అయింది. రెండో సంతానం కోసం కరీంనగర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్తే పెద్ద ఆపరేషన్ చేశారు. తర్వాత కడుపు మధ్యలో కుట్లు ఊడిపోయి, రంద్రం పడిందని ఆసుపత్రికి వెళ్తే వారు నిర్లక్ష్యం చేశారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో సంప్రదించగా ఐదు సార్లు ఆపరేషన్ చేశారు. అయినా నొప్పి తగ్గకపోవడంతో హైదరాబాద్‌లోని ప్రైవేట్ హాస్పిటల్‌లో చూపించుకున్న. అక్కడ ఆపరేషన్‌కు రూ.5 లక్షల వరకు ఖర్చు అవుతుందన్నారు. ఇప్పటికే ఆస్తులు అమ్మి ఆపరేషన్లకు పెట్టిన. మళ్లీ ఆపరేషన్ చేయించుకునే ఆర్థిక స్థోమత లేదు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించి ఆదుకోండి. – కొండ భవాని, ఇందిరమ్మకాలనీ