అభివృద్ధి.. సంక్షేమం | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి.. సంక్షేమం

Jun 3 2025 12:07 AM | Updated on Jun 3 2025 12:07 AM

అభివృ

అభివృద్ధి.. సంక్షేమం

సిరిసిల్ల:

‘రాష్ట్రం ఆవిర్భవించి నేటితో 11 ఏళ్లు పూర్తి. అమరవీరుల త్యాగాల పునాదులపై అవతరించిన తెలంగాణ అన్ని రంగాల్లో ప్రగతి దిశగా సాగుతోంది. పారదర్శక, సుపరిపాలన లక్ష్యాలుగా అభివృద్ధి, సంక్షేమబాటలో ప్రజా ప్రభుత్వం పాలన సాగుతోంది’ అని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పో లీస్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో కలెక్టర్‌ సందీప్‌కుమార్‌ ఝా, ఎస్పీ మహేశ్‌ బీ గీతేతో కలిసి సోమవారం జాతీయ జెండాను ఆవిష్కరించారు. జిల్లాలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు.. ప్రభుత్వ పాలన.. భవిష్యత్‌ ప్రణా ళికను వివరిస్తూ సుదీర్ఘ ప్రసంగం చేశారు.

నేతన్నలకు అండగా

నేతన్నలకు నిరంతరం పని కల్పించేందుకు 4.30 కోట్ల మీటర్ల వస్త్రోత్పత్తి ఆర్డర్లను అందించామన్నా రు. రూ.50 కోట్లతో యారన్‌(నూలు) డిపోను వే ములవాడలో ఏర్పాటు చేశామని తెలిపారు. 4,111 మందికి 10శాతం యారన్‌ సబ్సిడీగా రూ.6.91 కోట్లు చెల్లించామని పేర్కొన్నారు. రాజన్న ఆలయ అభివృద్ధికి సీఎం రేవంత్‌రెడ్డి గతేడాది నవంబరులో శ్రీకారం చుట్టారని, రూ.150 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. అన్నదాన సత్రాన్ని రూ.35.25 కోట్ల అంచనాలతో నిర్మిస్తున్నామని, కోడెల సంరక్షణకు ఆధునిక గోశాలను నిర్మిస్తున్నామన్నారు.

పేదలకు కూడు.. గూడు

జిల్లాలోని రేషన్‌కార్డుదారులకు ప్రతినెలా 3,300మెట్రిక్‌ టన్నుల సన్నబియ్యం ఇస్తున్నామని, వసతి గృహాలకు మరో 220 మెట్రిక్‌ టన్నులు సరఫరా చేస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో 7,808 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు మంజూరు పత్రాలు అందించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిపామని తెలిపారు. మధ్యమానేరు ముంపు గ్రామాల నిర్వాసితులకు 4,696 ఇళ్లు మంజూరు చేశామన్నారు. రుద్రంగి, భీమారం తహసీల్దార్‌ ఆఫీస్‌లు, వేములవాడలో సబ్‌ రిజిస్ట్రా ర్‌ ఆఫీస్‌లను త్వరలో నిర్మిస్తామని పేర్కొన్నారు.

రెవెన్యూ సదస్సులు

భూ భారతి పైలట్‌ ప్రాజెక్ట్‌గా రుద్రంగి మండలాన్ని ఎంపిక చేసి భూసమస్యల పరిష్కారానికి రెవెన్యూ సదస్సులు నిర్వహించామని, భూమి కొలతలకు 149మంది సర్వేయర్లకు శిక్షణ ఇస్తున్నామన్నారు. జిల్లాలో ఈ యాసంగి సీజన్‌లో రికార్డు స్థాయిలో 2.68 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని పేర్కొన్నారు. చందుర్తి మండలం నర్సింగాపూర్‌, లింగంపేట, ఎన్గల్‌, కోనరావుపేట మండలం మర్రిమడ్ల, వేములవాడ రూరల్‌ మండలం నూకలమర్రి, వేములవాడ అర్బన్‌ మండలం రుద్రవరంలో 33/11 విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు.

మహిళలకు ఆర్థిక చేయూత

ఇందిరా మహిళ శక్తిలో జిల్లాలో 19 గ్రామ సంఘాలకు సీడ్స్‌, ఫెర్టిలైజర్‌ షాపుల లైసెన్స్‌లు అందించామని, 4,376 మహిళా సంఘాలకు బ్యాంకు ద్వా రా రూ.542 కోట్ల రుణాలు అందించామన్నారు. జిల్లాలో 40,285 ఎకరాలు సాగునీరు అందించేందుకు రూ.63.36 కోట్లతో మిగిలిన పనులను పూర్తి చేయిస్తామని హామీ ఇచ్చారు. 222 మంది రైతుల కుటుంబాలకు రూ.11.10 కోట్ల భీమా సొమ్ము పంపిణీ చేశామని తెలిపారు.

రూ.200 కోట్లతో స్కూల్‌ కాంప్లెక్స్‌

వేములవాడలో రూ.200 కోట్లతో 25 ఎకరాల్లో యంగ్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ కాంప్లెక్స్‌ మంజూరైందన్నారు. జిల్లాలోని 486 ప్రభుత్వ పాఠశాలల్లో ఐసీటీ ల్యాబ్‌ సౌకర్యం కల్పిస్తూ డిజిటల్‌ మాధ్యమంలో బోధనను అందిస్తున్నామన్నారు. రుద్రంగిలో రూ.42కోట్లతో అ డ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేస్తున్నామ న్నారు. అగ్రహారం డిగ్రీ కళాశాలలో రూ.10 కోట్ల తో మహిళా వసతి గృహం మంజూరైందన్నారు.

రోడ్లు, భవనాలు.. పరిశ్రమలు

జిల్లాలో ఉపాధిహామీలో 730 పనులను రూ.50.29 కోట్లతో చేపట్టామని, గ్రామ పంచాయతీ, ఇందిరా మహిళా శక్తి, సామాజిక, అంబేద్కర్‌, పాలశీతలీకరణ కేంద్రాల భవనాల నిర్మాణాలకు రూ.16.51 కోట్లు, మూడు పీహెచ్‌సీలకు రూ.4.45కోట్లు, 16 ఆరోగ్య ఉపకేంద్రాలకు రూ.3.20 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. పీఎంజీఎస్‌వైలో నాలుగు వంతెనలు, 12 రోడ్ల నిర్మాణాలకు రూ.59.97 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. సిరిసిల్లలో కోర్టు సముదాయాలకు రూ.81 కోట్లు, వైద్య కళాశాల వసతి గృహానికి రూ.166 కోట్లు మంజూరు అయ్యాయన్నారు. టీఎస్‌–ఐపాస్‌ ద్వారా రూ.5కోట్లతో 9 పరిశ్రమలను స్థాపించి 72 మందికి ఉపాధి కల్పించామని, టీ– ఐడియా, ఫ్రైడ్‌లో 73 పరిశ్రమలకు (రవాణా వాహనాలకు) రూ.3కోట్లు అందించామ ని తెలిపారు. టీ ప్రైడ్‌ పథకం కింద 42మంది ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు రూ.1.85కోట్లు సబ్సిడీ మంజూరు చేశామని వివరించారు.

వైద్య రంగంలో

జిల్లాలో 50అంగన్‌వాడీ భవనాలకు రూ.6కోట్లు మంజూరయ్యాయని, 121 పోక్సో బాధితులకు రూ.51.65 లక్షల పరిహారం అందిచామని తెలిపా రు. సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా 4,969 మందికి రూ.17.76 కోట్లు, 248 మందికి ఎల్‌వోసీలు అందించి రూ.4.84 కోట్ల సాయం చేశామని తెలిపారు. జిల్లాలోని 324 చెరువులు, కుంటల్లో 46.71లక్షల చేప పిల్లలను వేశామని తెలిపారు. 123 మంది రైతులు 331 ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసేలా ప్రోత్సహించామని పేర్కొన్నారు. రుద్రంగిలో పోలీస్‌స్టేషన్‌ భవనానికి రూ.2.50కోట్లు మంజూరు అయ్యాయని వివరించారు. ఏఎస్పీ శేషాద్రినీరెడ్డి, చంద్రయ్య, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయి, ఏఎంసీ చైర్మన్లు వెల్ముల స్వరూపారెడ్డి, సబేరా బేగం, రాజు, ఎల్లయ్య, జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు.

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు

పరేడ్‌ గ్రౌండ్‌లో జరిగిన కార్యక్రమంలో నర్సింగ్‌ కళాశాల విద్యార్థినులు, స్కూల్‌ పిల్లలు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. జిల్లాలోని 110 స్వశక్తి సంఘాలకు 102.45కోట్ల బ్యాంక్‌ లింకేజీ రుణాలను విప్‌ శ్రీనివాస్‌ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రైతులకు విత్తన కిట్లను అందజేశారు. టీ ప్రైడ్‌ పథకం కింద 42 మందికి రూ.1.85 కోట్ల సబ్సిడీ మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. మహిళలకు కుట్టుమిషన్లను పంపిణీ చేశారు. రవాణాశాఖ, ఆర్టీసీ శకటాలను ప్రదర్శించారు. అంతకుముందు పాత బస్‌స్టాండ్‌ నేతన్న చౌక్‌ వద్ద తెలంగాణ అమరవీరుల స్తూపానికి ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, కలెక్టర్‌ సందీప్‌ కుమార్‌ ఝా, ఎస్పీ మహేష్‌ బీ గితే నివాళి అర్పించారు.

పారదర్శక ప్రజాపాలన అందిస్తున్నాం

వేములవాడ ఆలయ విస్తరణ.. పల్లె ప్రగతికి బాటలు

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

అభివృద్ధి.. సంక్షేమం1
1/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం2
2/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం3
3/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం4
4/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం5
5/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం6
6/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం7
7/8

అభివృద్ధి.. సంక్షేమం

అభివృద్ధి.. సంక్షేమం8
8/8

అభివృద్ధి.. సంక్షేమం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement