పీసీసీలో మనోళ్లకు చోటు | - | Sakshi
Sakshi News home page

పీసీసీలో మనోళ్లకు చోటు

May 31 2025 12:54 AM | Updated on May 31 2025 12:54 AM

పీసీస

పీసీసీలో మనోళ్లకు చోటు

● పీఏసీ కమిటీలో దుద్దిళ్ల, పొన్నం, ఆది ● కేబినెట్‌లో చోటు కోసం ఉమ్మడి నేతల ఆరాటం

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌:

కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం ప్రకటించిన వివిధ పీసీసీ కమిటీల్లో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు, మాజీ మంత్రికి చోటు దక్కింది. పీసీసీ కమిటీల్లో కీలకమైన రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) సభ్యులుగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌లను నియమించారు. కాగా.. ఇటీవల కొంతకాలంగా పార్టీ పెద్దల తీరుపై అసంతృప్తితో రగిలిపోతున్న మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డికి సలహా కమిటీలో అవకాశం కల్పించారు. అదేవిధంగా డీలిమిటేషన్‌ కమిటీలో ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలను సభ్యులుగా నియమించారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలుగా గెలవగా, అందులో నలుగురికి పీసీసీ కమిటీల్లో అవకాశం లభించింది.

మంత్రి వర్గంలో ఆది..

మంత్రి వర్గ విస్తరణ త్వరలో జరగబోతున్న నేపథ్యంలో ఉమ్మడి జిల్లాకు మరో బెర్తు ఖాయంగా కని పిస్తోంది. కొత్తగా ఎన్నికై న ఎమ్మెల్యేల్లో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఉన్నా రు. మున్నూరు కాపు సామాజికవర్గం కోణంలో ఆ యనకు బెర్తు ఖాయమయ్యే అవకాశాలున్నాయని సమాచారం. మాదిగ సామాజిక వర్గం తరఫున త మకు కూడా కేబినెట్‌ లో చోటు కల్పించాలని మరో ప్రభుత్వ విప్‌ అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణలు కో రుతున్నారు. మరోవైపు తనకు కూడా మంత్రి పద వి ఇవ్వాలని ఇటీవల రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ కోరిన విషయం విదిత మే. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి ఇప్పటికే దు ద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ కేబినెట్‌లో ఉ న్నారు. వీరికితోడుగా మరో ఒక్క బెర్తు మాత్రమే ఖ రారయ్యే అవకాశాలు ఉండటంతో ఈ ఒక్క మంత్రి పదవి ఎవరిని వరిస్తుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

పీసీసీలో మనోళ్లకు చోటు1
1/5

పీసీసీలో మనోళ్లకు చోటు

పీసీసీలో మనోళ్లకు చోటు2
2/5

పీసీసీలో మనోళ్లకు చోటు

పీసీసీలో మనోళ్లకు చోటు3
3/5

పీసీసీలో మనోళ్లకు చోటు

పీసీసీలో మనోళ్లకు చోటు4
4/5

పీసీసీలో మనోళ్లకు చోటు

పీసీసీలో మనోళ్లకు చోటు5
5/5

పీసీసీలో మనోళ్లకు చోటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement