మానవ అక్రమ రవాణాను అరికట్టాలి
● జిల్లా జెండర్, ఈక్విటీ కో–ఆర్డినేటర్ పద్మజా
సిరిసిల్ల: మానవ అక్రమ రవాణాను అరికట్టాలని, సామాజిక బాధ్యతగా అందరూ భాగస్వాములు కావాలని జెండర్ అండ్ ఈక్విటీ జిల్లా కోఆర్డినేటర్ పద్మజా కోరారు. జిల్లా కేంద్రంలోని గీతానగర్ స్కూల్‌లో ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి ఆధ్వర్యంలో రెండు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ప్రారంభించారు. పద్మజా మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందన్నారు. సైబర్ ట్రాఫికింగ్‌పై అవగాహన కల్పించాలన్నారు. ఉద్యోగం, సినిమా అవకాశాలు ఇప్పిస్తామంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహాల్లో అమ్ముతున్నారని.. ఇలాంటి వాటి గురించి ప్రజలకు వివరించాలని సూచించారు. ప్రజ్వల సంస్థ సీనియర్ ప్రాజెక్టు మేనేజర్ బలరాం మాట్లాడుతూ మానవ అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే మన ఆడపిల్లలను రక్షించుకోవచ్చన్నారు. ప్రజ్వల సంస్థ ద్వారా ఇప్పటి వరకు 30 వేల మంది అమ్మాయిలు, మహిళలను కాపాడినట్లు తెలిపారు. ఇలాంటి వాటిపై సఖీ, భరోసా, చైల్డ్‌లైన్, పోలీస్ టోల్ ఫ్రీ నంబర్స్ 1098, 100, 181, 1930, 181లో గురించి చెప్పాలన్నారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోఆర్డినేటర్ శైలజా, అసిస్టెంట్ కోఆర్డినేటర్ అంబర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.


