రమణీయం రాములోరి రథోత్సవం
బిల్లులు చెల్లించి.. సహకరించాలి
వేములవాడఅర్బన్: వేములవాడ అర్బన్ మండలం మారుపాకలో సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల ఆధ్వర్యంలో రైతు పొలంబాటపై అవగాహన సదస్సు ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఏవో జగదీశ్, ఏఈ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. ఇప్పటి వరకు బావి, బోర్ల మోటార్లకు విద్యుత్ సాంక్షన్ లేకుంటే వెంటనే సెస్ కార్యాలయంలో తీసుకోవాలని సూచించారు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాలని కోరారు. విద్యుత్ సమస్యలుంటే సెస్ సిబ్బందికి తెలిపాలన్నారు. కార్యక్రమంలో గ్రామ రైతులు, విద్యుత్ సిబ్బంది తదితరులు ఉన్నారు.
కోనరావుపేట(వేములవాడ): మామిడిపల్లిలోని శ్రీసీతారామచంద్ర స్వామి ఆలయం బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రథోత్సవం
ఘనంగా నిర్వహించారు. మాలధారుల భక్తిగీతాలు ఆలపించగా.. స్వామి వారి రథం ముందుకు కదిలింది. అధిక సంఖ్యలో భక్తులు
తరలివచ్చి స్వామి వారికి మొక్కులు చెల్లించుకున్నారు.
రమణీయం రాములోరి రథోత్సవం


