నేడు టెక్స్‌పోర్ట్ యూనిట్ ప్రారంభం
సిరిసిల్ల: పెద్దూరు అపెరల్ పార్క్‌లో పంక్చుయేట్ వరల్డ్ ప్రైవేట్ లిమిటెడ్(టెక్స్‌పోర్ట్) యూనిట్‌ను శుక్రవారం రాష్ట్ర మంత్రులు తుమ్మల నాగేశ్వర్‌రావు, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ప్రారంభిస్తారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఈమేరకు ఏర్పాట్లను కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా, ఎస్పీ మహేశ్ బీ.గీతేతో కలిసి గురువారం పరిశీలించారు. కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నియోజకవర్గ ఇన్‌చార్జి కె.కె.మహేందర్‌రెడ్డి, ఆర్డీవో రాధాబాయి, టెక్స్‌టైల్ శాఖ జేడీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
మంత్రుల పర్యటన షెడ్యూల్ ఇలా..
మంత్రులు శుక్రవారం ఉదయం 8.30 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరుతారు. 11.30 గంటలకు అపెరల్ పార్క్‌కు చేరుకుని టెక్స్‌పోర్టు యూనిట్‌ను ప్రారంభిస్తారు. మహిళా ఉద్యోగులకు నియామకపత్రాలు అందజేస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు తిరుగు ప్రయాణమవుతారు.
పటిష్ట బందోబస్తు
సిరిసిల్లక్రైం: అపెరల్‌పార్క్‌లో టెక్స్‌పోర్ట్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా మంత్రుల పర్యటనకు పటిష్ట భద్రత చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ మహేశ్ బీ.గీతే తెలి పారు. పోలీస్ అధికారులతో సమావేశమయ్యారు. 300 మందితో బందోబస్తు చేపడుతున్నట్లు తెలిపారు. ఏఎస్పీ శేషాద్రినిరెడ్డి, డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ మురళీకృష్ణ, సీఐలు కృష్ణ, మొగిలి, శ్రీనివాస్, వీరప్రసాద్, శ్రీనివాస్, వెంకటేశ్వర్లు, సదన్‌కుమార్, మధుకర్, నాగేశ్వరరావు, ఆర్‌ఐలు రమేశ్, యాదగిరి ఉన్నారు.
చిన్నారులకు టీకాలు వేయించాలి
బోయినపల్లి(చొప్పదండి): ఐదేళ్లలోపు వయస్సు గల చిన్నారులకు వ్యాధి నిరోధక టీకాలు వేయించాలని జెడ్పీ సీఈవో ఎస్.వినోద్ కోరారు. మండలకేంద్రంలోని పీహెచ్‌సీలో స్పెషల్ ఇమ్యూనైజేషన్ క్యాంపుపై గురువారం సమీక్షించారు. బోయినపల్లి పీహెచ్‌సీ వైద్యాధికారి కార్తీక్ మాట్లాడుతూ ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇటుకబట్టీలలో పనిచేస్తున్న వారి పిల్లల్లో టీకాలు వేయించుకోని వారిని గుర్తించి టీకాలు వేస్తామని తెలిపారు. తహసీల్దార్ నారాయణరెడ్డి, ఎంపీడీవో జయశీల, ఎంఈవో శ్రవణ్‌కుమార్, వైద్యులు వినూత్న, శిరీష ఉన్నారు.
మున్సిపల్ కార్మికులపై చిన్నచూపు వీడాలి
సిరిసిల్లటౌన్: మున్సిపల్ కార్మికుల వేతనాల పెంపు కోసం అనేక పోరాటాలు చేస్తుంటే సర్కారు చిన్నచూపు చూడడం సరికాదని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ గురువారం మున్సిపల్ ఆఫీస్ ఎదుట ధర్నా చేపట్టారు. గత ప్రభుత్వం 2021 జూన్‌లో 11వ పీఆర్సీ కింద మున్సిపల్ కార్మికుల వేతనాలు రూ.12వేలు నుంచి రూ.15,600 పెంచారని, సిరిసిల్లలోని కార్మికులకు 5 నెలల పీఆర్సీ బకాయిలు రావాల్సి ఉన్నాయన్నారు. గురువారం ఉదయం 5 గంటలకు విధులు బహిష్కరించగా.. 6 గంటల వరకు కమిషనర్ ఎస్.సమ్మయ్య వచ్చి చర్చలు జరిపి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి నాలుగు రోజుల వరకు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో వారు విధుల్లోకి వెళ్లారు.
‘ఆర్‌ఎంపీలు పరిమితి దాటి వైద్యం చేయొద్దు’
చందుర్తి(వేములవాడ): ఆర్‌ఎంపీ, పీఎంపీలు పరిమితికి మించి వైద్యం చేసి కష్టాలు తెచ్చుకోవద్దని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌రెడ్డి కోరారు. లింగనిర్ధారణ చేయించి భ్రూణహత్యలకు పాల్పడ్డారన్న వార్తల నేపథ్యంలో జిల్లా ఆర్‌ఎంపీ, పీఎంపీల సంఘం ఆధ్వర్యంలో గురువారం చందుర్తిలో సమావేశమయ్యారు. ప్రవీణ్‌రెడ్డి మాట్లాడుతూ నిబంధనలకు లోబడి వైద్యం చేయాలన్నారు. ఒక్కరూ తప్పు చేసినా అందరికి వస్తుందన్నారు. డబ్బుల కోసం ఆశించి ఇష్టం వచ్చినట్లు చేస్తే వారిని గుర్తించి సంఘంలో నుంచి తొలగింస్తామని హెచ్చరించారు. నాయకులు మిట్టపల్లి రాజమల్లు, సిరిగిరి కాంతారావు, ఎండీ ఇస్మాయిల్, మద్దిరాల సత్యనారాయణ, రాజలింగం, జగన్, వాసం నారాయణ, బొప్ప శంకర్ పాల్గొన్నారు.
నేడు టెక్స్‌పోర్ట్ యూనిట్ ప్రారంభం


