
యోగాతో మానసిక ప్రశాంతత
● ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్
సిరిసిల్ల: యోగా ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎన్.శ్రీనివాస్ కోరారు. సిరిసిల్లలో సోమవారం ఐఎంఏ ఆధ్వర్యంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవం నిర్వహించారు. శ్రీనివాస్ మాట్లాడుతూ నిత్యం ఒత్తిడితో కూడిన జీవనంలో ధ్యానం చేయడం ద్వారా మానసిక ప్రశాంతత లభించడంతోపాటు సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుందన్నారు. మెడిటేషన్ దినచర్యలో భాగం కావాలని, విధిగా అలవాటు చేసుకోవాలన్నారు. ఐఎంఏ జిల్లా మహిళా అధ్యక్షురాలు డాక్టర్ లీలాశిరీష, వైద్యులు పద్మావతి, శోభారాణి, గీతావాణి, రజని, మెడిటేషన్ జిల్లా కోఆర్డినేటర్ కోడం సతీశ్ పాల్గొన్నారు.