● పరిశ్రమలశాఖ జీఎం హనుమంతు
సిరిసిల్ల: నూతన ఆవిష్కరణలు, టెక్నాలజీ వినియోగంతో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవాలని జిల్లా పరిశ్రమల శాఖ జీఎం హనుమంతు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పారిశ్రామిక విధానాలు, స్వయం ఉపాధి పథకాలు, ఉపాధి అవకాశాలపై మంగళవారం కలెక్టరేట్‌లో పాలిటెక్నిక్, ఇంజినీరింగ్, ఐటీఐ, డిగ్రీ విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం మాట్లాడుతూ, ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని స్వయం ఉపాధిరంగంలో రాణించాలన్నారు. మార్కెట్‌లో వస్తున్న నూతన టెక్నాలజీ, యంత్రాలు అప్‌డేట్‌పై ఎప్పటి కప్పుడు సమాచారం ఉండాలని పేర్కొన్నారు. జిల్లా ఉపాధి కల్పన అధికారి రాఘవేందర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం డిజిటల్ ఎంప్లాయిమెంట్ ఎక్చేంజ్ ఆఫ్ తెలంగాణ (డీఈఈటీ) అమలు చేస్తుందని, ఇందులో నమోదైతే విద్యార్థులకు ఉన్న నైపుణ్యాల అర్హత ప్రకారం ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాల వివరాలు తెలుస్తాయన్నారు. నిరుద్యోగులకు పరిశ్రమలకు వారధిగా ఇది పనిచేస్తుందని పేర్కొన్నారు. డీఆర్‌డీవో శేషాద్రి, పరిశ్రమల శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ భారతి, జిల్లా సంక్షేమ అధికారి లక్ష్మీరాజం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న తదితరులు పాల్గొన్నారు.