
చి‘వరి’కి మేతగా..
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఆరుగాలం శ్రమించి రైతులు పండించిన పంటలు నీరందక చి‘వరి’కి మూగజీవాలకు మేతగా మారుతున్నాయి. ఎల్లారెడ్డిపేట మండల రైతుల వరప్రదాయిని సింగసముద్రం ఆయకట్టు కింద సాగుచేసిన పంటలు చేతికొచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. సింగసముద్రంలో 24 ఫీట్ల వరకు నీరు ఉండగా, ఈ నీటితో 1,600 ఎకరాల ఆయకట్టు భూములకు సాగునీరు అందించాల్సి ఉంది. చివరి భూముల్లోని పంటలు చేతికి రావాలనే ఉద్దేశ్యంతో నీటిపారుదల శాఖ అధికారులు, రైతులు సమావేశమై వెయ్యి ఎకరాలకే తైబందీ విధించుకున్నారు. అయినా నీరు అందక పంటలు ఎడిపోతున్నాయి. రాచర్లబొప్పాపూర్ శివారులోని పంట పొలాల్లో ఆదివారం మేకలు, గొర్రెలు మేయడం కనిపించింది.