● రూ.16లక్షలతో ఏర్పాటు ● కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
సిరిసిల్ల: వేములవాడలో అంబేడ్కర్ కాంస్య విగ్రహ ఏర్పాటుకు రూ.16లక్షలు మంజూరు చేసి, టెండర్లు పిలిచామని కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా తెలిపారు. కలెక్టరేట్‌లో శనివారం మహనీయుల జయంతి వేడుకలపై అధికారులు, వివిధ సంఘాల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మా ట్లాడుతూ జగ్జీవన్‌రామ్, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి కార్యక్రమాల పోస్టర్లు తయారు చేయాలన్నారు. ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్‌రామ్ జయంతి, ఏప్రిల్ 14న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ జయంతి వేడుకలను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేయాలని సూచించారు. సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి, ఇన్‌చార్జి ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజా మనోహర్‌రావు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ స్వప్న, ఏఎస్‌డబ్ల్యూవో విజయలక్ష్మి, వివిధ ఎస్సీ, ఎస్టీ కులసంఘాల నాయకులు రా గుల రాములు, గుంటి వేణు, బొలుమాల శంకర్, బడే స్వామిదాస్, జక్కుల యాదగిరి, కొమ్ము బాల య్య, కె.సుధాకర్, మేకల కమలాకర్ పాల్గొన్నారు.