
వెంకట్‌రెడ్డిని అభినందిస్తున్న మంత్రి కేటీఆర్
● అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ ● ఈనెల 31న ఢిల్లీలో అందజేత
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్‌రెడ్డి చేస్తున్న సామాజిక సేవలను గుర్తించిన అంబేడ్కర్ ఇంటర్నేషనల్ సెక్టార్ సంస్థ జాతీయస్థాయి ఉత్తమ సామాజిక సేవ కార్యకర్త అవార్డుకు ఎంపిక చేసింది. ఢిల్లీలో ఈనెల 31న అవార్డు అందజేయనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలువగా.. ఆయన అభినందించారు. ‘భారత్ కే అన్‌మోల్’ అవార్డుకు ఎంపికైన సర్పంచ్ వెంకట్‌రెడ్డిని ఉపసర్పంచ్ ఒగ్గు రజిత, పంచాయతీ కో–ఆప్షన్ సభ్యుడు హైమద్, ఎల్లారెడ్డిపేట మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజుయాదవ్, పాలకవర్గం సభ్యులు అభినందించారు.